ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో చెప్పాలి : వైసీపీకి తమ్మారెడ్డి కౌంటర్

రెండు రోజుల క్రితం.. టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమపై వైసీపీ కొవ్వూరు ఎమెల్యే ప్రసన్న కూమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ ప్రముఖులు బలిసికొట్టుకుంటున్నారని ఆయన అన్నారు. అయితే… ప్రసన్న కుమార్‌ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలకు టాలీవుడ్‌ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. అసలు ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో వాళ్ళే చెప్పాలని సవాల్ విసిరారు.

మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా అని చాలెంజ్ విసిరారు. మీరు రాజకీయంలోకి వచ్చినప్పుడు మీ ఆస్తులు ఎంత ? ఇప్పుడు ఎంత ? అని ప్రశ్నించారు. కుల ప్రస్తావన లేకుండా ఉపాధి కల్పించే ది సినీ పరిశ్రమ అని వెల్లడించారు. కోట్లు ఖర్చుపెట్టి నాయకులను ఎన్నుకుంటున్నామని… మీరు రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు తమ్మారెడ్డి. సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం చేయడమేంటని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.