మీరు సోషల్ మీడియా కి బానిసలయ్యారని చెప్పే కొన్ని సంకేతాలు..

-

సమయం చిక్కినపుడలా ఫోన్లో దూరి సోషల్ మీడియా (Social Media)లో కాలం గడిపేస్తుంటారు. బోర్ కొట్టినా, కాలక్షేపం కోసం, ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల సోషల్ మీడియాని తెగ వాడేస్తుంటారు. ఈ అలవాటు తీవ్రంగా మారి మిమ్మల్ని సోషల్ మీడియాకి బానిసలుగా చేస్తుందని మీకు తెలుసా? సోషల్ మీడియా కారణంగా కుటుంబ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనకపోవడం, పనుల్లో అలసత్వం, బద్దకం పెరిగిపోవడం వంటి ఇబ్బందులు వస్తుంటాయి. మీరు సోషల్ మీడియాకి బానిసగా మారితే ఈ కింది లక్షణాలు మీలో కనిపిస్తాయి.

సోషల్ మీడియా | Social Media

సోషల్ మీడియాలో గంటల సమయం వృధా

ఏదైనా నోటిఫికేషన్ వచ్చినపుడు దానికి జవాబు ఇద్దామని చెప్పి, ఓపెన్ చేసి, ఆ తర్వాత గంటల పాటు సమయం గడపడం. ఒక్కసారి దాన్నుండి బయటకు వస్తే అప్పటికే ఎన్నో గంటలు వృధా అయిపోయి కనిపిస్తాయి. ఇలా మీకు తరచుగా జరుగుతుంటుందా? చిన్న రిప్లై ఇద్దామని చెప్పి ఎక్కువ సేపు సోషల్ మీడియాలో గడుపుతున్నారా?

అభిరుచుల నిర్లక్ష్యం

అప్పటి వరకూ మీకున్న అభిరుచులను నిర్లక్ష్యం చేయడం. వాటిల్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం. జీవితంలో చేయాల్సిన చాలా విషయాలని తేలికగా తీసుకోవడం. ఈ కారణంగా మంచి మంచి అభిరుచులు కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుంది.

నోటిఫికేషన్ ఆందోళన

ఏదైనా నోటిఫికేషన్ వచ్చి దాన్ని త్వరగా చూసే అవకాశం రాకపోతే ఆందోళన చెందుతున్నారా? అందులో ఏదైనా అవసరం అయ్యేది ఉందేమో అన్న అనుమానం పెరగడం, ఆ తర్వత ఓపెన్ చేసాక, పెద్దగా ప్రయోజనం లేని నోటిఫికేషన్ అని తెలుసుకోవడం .

అన్నీ పంచుకోవాలనే ఉత్సాహం

ఏది చేసినా పంచుకోవాలని ఆరాటం. తిన్నా, చిన్న పనిచేసినా, ఏదైనా సరే అందరితో పంచుకోవాలనే ఉబలాటం ఎక్కువగా ఉంటే మీరు సోషల్ మీడియాకి బానిసలుగా మారుతున్నట్టే లెక్క.

Read more RELATED
Recommended to you

Latest news