స‌ర్వ సంప‌న్నుడు సర్వర్ అవతారమెత్తాడు.. ఎందుకంటే..?

-

కాలు బయటపెడితే ఖరీదైన కార్లు, ఇంటినిండా నౌకర్లు… కానీ ఆ యువకుడికి ఇవేమీ పట్టలేదు. పెట్టిపుట్టాడని అంటారే… అలాంటివాడే ద్వారకేశ్‌ టక్కర్‌! తండ్రి పెద్ద వ్యాపారి… కోటీశ్వరుడు. వడోదరా జిల్లాలోని పద్రా పట్టణానికి చెందిన ఓ కోటీశ్వరుడి కుమారుడు ఈ ద్వారకేశ్ టక్కర్. స్వయంగా తన కాళ్ల మీద తాను నిలబడాలన్న కోరిక అతన్ని ఇంటి నుంచి వెళ్లిపోయేలా ప్రేరేపించింది. ద్వారకేశ్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడన్న మాటే కానీ చదువంటే ఇష్టం లేదు. ఏదో ఒకటి చేయాలని ఇంటి నుంచి వెళ్లిపోయి.. సిమ్లా చేరాడు.

అక్కడ ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని ఓ హోటల్ మేనేజర్ ను అడుగగా, అతని వాలకంపై అనుమానం వచ్చిన మేనేజర్, ఐడీ కార్డు అడిగాడు. దాన్ని చూసిన తరువాత పద్రా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ద్వారకేశ్ పారిపోయాడు. అతని కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టగా, రోడ్డు పక్కన ఉన్న చిన్న హోటల్ లో అంట్లు కడుగుతూ కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విషయాన్ని కుటుంబీకులకు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version