చోరీ చేయాలని పబ్ కి వెళ్లిన దొంగ.. తాగి ఏం చేశాడంటే..!

-

మ్యూజిక్, కళ్లకు జిగేల్ అనిపించే రంగు రంగుల లైట్లు.. బ్రాండెండ్ మద్యం బాటిళ్లు ఉంటే పబ్ లలో మద్యం తాగుతూ.. డ్యాన్స్ చేయాలని చాలా మంది అనుకుంటారు. వీటిలో సంపాదన కూడా ఎక్కువే ఉంటుంది. డబ్బులు ఉంటాయనే భావనలో ఓ దొంగ పబ్ కే కన్నెం వేయాలనుకున్నాడు. ఓ పబ్ లో చొరబడి.. డబ్బులు చిల్లిగల్ల కూడా లేకపోవడంతో మద్యం బాటిళ్లను చూసి ఆగలేకపోయాడు. నచ్చిన మందు బాటిళ్లను స్వాహా చేసేసి.. వీరంగం సృష్టించాడు. తప్ప తాగి అక్కడే సోఫాపై పడుకుని జైలు పాలయ్యాడు. ఈ ఘటన యూకేలోని న్యూక్యాస్టేలోని తవేరన్ లో చోటు చేసుకుంది.

drunker-sleep
drunker-sleep

మరియన్ పెట్రికాస్ (30) అనే దొంగ స్థానికంగా ఉండే ఓ పబ్ లో దొంగతనానికి చేయాలని నిశ్చయించుకున్నాడు. పబ్ మూసివేసిన తర్వాత రాత్రి అందులో చొరబడ్డాడు. క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్లి చూడగా.. అందులో చిల్లిగల్ల కూడా కనిపించలేదు. దీంతో అతడికి ఏం చేయాలో తోచలేదు. కళ్ల ముందు బ్రాండెడె మద్యం బాటిళ్లు కనిపించాయి. వాటిని ఎత్తుకెళ్లి అమ్మేయాలని భావించాడు. ఆశపుట్టి చాలా ఎక్కువ బాటిళ్లను మూటకట్టేశాడు.

ఆ తర్వాత ఏమైందో తెలియదు. అన్నీ మద్యం బాటిళ్లు మోసుకెళ్లడం కష్టమవుతుందని భావించి అక్కడే కూర్చొని తాగడం మొదలు పెట్టాడు. మద్యం మత్తులో జారుకుని తాగిన బాటిళ్లు, ఫుల్ బాటిళ్లను, పబ్ లో ఉన్న వస్తువులను పగులగొట్టడం మొదలుపెట్టాడు. అలసిపోయిన తర్వాత సోపాపై పడుకుండిపోయాడు. తెల్లవారీనా సోయి లేకుండా గురకలు వేస్తూ పడుకున్నాడు.

పబ్ ఓనర్ డెవిడ్ కింగ్ ఉదయం పబ్ తలుపులు తెరిచాడు. పబ్ అంతా ధ్వంసమై కనిపించింది. మద్యం బాటిళ్లు, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో ఆయన ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. పబ్ ని ఎవరో కావాలని ధ్వంసం చేసి ఉంటారని భావించి పోలీసులను సంప్రదించాడు. ఇంతలో అతడికి గురక శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని చూడగా.. సోపాపై మరియస్ పెట్రికాస్ గాఢ నిద్రలో ఉన్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులో తీసుకున్నారు. కోర్టు 12 నెలల జైలు శిక్ష కూడా విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news