ఈ దేశాల్లో ఒక్క పాము కూడా లేదు..? కారణాలు ఇవే..!

-

పల్లెల్లో అయినా, పట్టణాల్లో అయినా పాములు ఉండటం సహజం. ఇవి ఎక్కడపడితే అక్కడ కనిపిస్తాయి. ఏటా పాము కాటు గురై చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. పాములు లేని ఊరే ఉండదు కదా..! పాములే లేని దేశం ఉందంటే నమ్మగలరా..? కానీ నిజం.. ఆ దేశంలో ఒక్క పాము కూడా లేదట. ఐర్లాండ్‌లో ఒక్క పాము కూడా కనిపించదు. పాములు ఎందుకు కనిపించవు. ఎందుకు ఈ దేశంలో పాములు లేవు..?

ఐర్లాండ్‌లో పాములు ఎందుకు లేవు?

నిజానికి, ఐర్లాండ్‌లో పాములు ఉండకపోవడానికి ఒక పౌరాణిక కారణం ఉంది. ఐర్లాండ్‌లోని క్రైస్తవ మతాన్ని రక్షించడానికి, సెయింట్ పాట్రిక్ దేశం నలుమూలల నుండి పాములను ద్వీపం నుండి తీసుకెళ్లి సముద్రంలో విసిరినట్లు చెబుతారు. 40 రోజుల పాటు తినకుండా, తాగకుండా ఈ పని చేశారట.

శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

ఈ దేశంలో పాములు ఎప్పుడూ లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐర్లాండ్‌లో ఇప్పటి వరకు పాములు ఉన్న దాఖలాలు లేవని ఫాసిల్ రికార్డ్స్ విభాగం చెబుతోంది. ఐర్లాండ్‌లో పాములు లేకపోవడం గురించి మరొక కథ ఉంది. ఇంతకు ముందు ఇక్కడ పాములు ఉండేవి, కానీ ఇక్కడ చలి ఎక్కువగా ఉండటంతో అవి చనిపోయాయి. అప్పటి నుంచి ఇక్కడ విపరీతమైన చలి కారణంగా పాములు కనిపించడం లేదని నమ్ముతారు.

బ్రిటన్, ఐర్లాండ్‌లోని పురావాస్తు రికార్డుల ప్రకారం, ఈ రెండు దేశాల్లో ఎప్పుడూ పాములు లేవట. అయితే ఆ తర్వాత బ్రిటన్‌లో మూడు రకాల జాతుల పాములు కనిపించాయి. గడ్డి పాములు, ఎడ్డర్ పాములు, నునుపైన పాములు వంటి సరీసృపాలు జాతులను గుర్తించారు. 100 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఐర్లాండ్ నీటిలో మునిగిపోయిందని చెబుతారు. ఫలితంగా, ఇక్కడ సరీసృపాలు కనిపించకుండా పోయాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ దేశాల్లో కూడా పాములు లేవు

మరో విషయం ఏమిటంటే న్యూజిలాండ్‌లో కూడా పాములు లేవు. ఈ ద్వీప దేశం అనేక అడవి జంతువులకు నిలయం, కానీ ఆశ్చర్యకరంగా, ఇప్పటివరకు ఇక్కడ ఒక్క పాము కూడా కనుగొనబడలేదు. ఇక్కడ బల్లులు మాత్రమే కనిపిస్తాయట. గ్రీన్లాండ్, అంటార్కిటికా, ఉత్తర రష్యా, కెనడాలో కూడా పాములు లేవని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం అక్కడి వాతావరణ పరిస్థితులేనట.

Read more RELATED
Recommended to you

Latest news