మామిడి చెట్టుమీద మూడు అంతస్థుల భవనం.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

సాధారణంగా..ఇంటి చుట్టుపక్కలంతా పచ్చని చెట్లు ఉంటే..మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.కానీ ఇళ్లే చెట్టుమీద ఉంటే..అంతేకాదు..వంటగదిలో ఉండే మామిడిపండును కోసుకుని కట్‌ చేసుకుని తింటే భలే ఉంటుంది కదా..రాజాస్థాన్‌లోని అజ్మీర్‌కి చెందిన వ్యాపారవేత్త కుల్‌ ప్రదీప్‌ సింగ్‌ మామిడి చెట్టుపై మూడు అంతస్తుల భవనం కట్టాడు. 40 అడుగుల మామిడిచెట్టుపై నిర్మించిన ఈ ఇల్లు లింకా బుక్‌ఆప్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

ఈ మూడు-అంతస్తుల ట్రీహౌస్‌లో రెండు బెడ్‌రూమ్‌లు, వంటగది, లైబ్రరీతో సహా లివింగ్ ఏరియా కూడా ఉన్నాయి. తాను ఇలా చెట్టుపై ఇంటిని .. ఈ ట్రీహౌస్ ఉన్న ప్రాంతం పండ్ల చెట్లకు ప్రసిద్ధి చెందిందట…4,000 చెట్లకు పైగా పండ్లు ఉండేవని ప్రదీప్ సింగ్ తెలిపారు. వీటి పండ్లను విక్రయించి ప్రజలు జీవనం సాగించేవారట.. అయితే జనాభా పెరుగుదల కారణంగా.. చెట్లను నరికివేయడం ప్రారంభించారు.

1999 ఏడాదిలో ఉదయపూర్‌లో ప్రదీప్ సింగ్ తాను ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం కోసం వెతుకుతున్నప్పుడు.. ఈ ప్రాంతంలోని చెట్లకు హాని చేయకూడదని నిర్ణయించుకున్నాడు. “చెట్లను నరకవద్దని, వాటిని మరెక్కడా నాటమని ప్రాపర్టీ డీలర్‌కి చెప్పినప్పుడు.. అతను ప్రదీప్ ఆలోచన లను తిరస్కరించి వెళ్లిపోయాడట.. అప్పుడు ప్రదీప్ సింగ్ ఇల్లు కట్టుకోవడం ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నారు. చెట్లను పెకిలించే బదులు.. దానిపైనే ఇల్లు కట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక స్థలం దాని మధ్యలో మామిడి చెట్టు.. సరసమైన ధరకు కొన్నాడు.

ఒక ఆర్కిటెక్ట్ సహాయంతో సింగ్ ఇంటి నిర్మాణం ఒక సంవత్సరంలో పూర్తయింది. ఆ సమయంలో మామిడి చెట్టు సుమారు 20 అడుగుల ఎత్తులో ఉంది. అప్పుడు ఇల్లు రెండు అంతస్తులతో నిర్మించారు. భవనం నిర్మాణం మొత్తం ఉక్కుతో చేశారు. ఇంటి గోడలు, అంతస్తులు సెల్యులోజ్ షీట్‌తో పాటు ఫైబర్‌తో తయారు చేశారు. చెట్టు చుట్టూ నాలుగు స్తంభాలను ఉంచారు. ఇవి పిడుగుపాటు సమయంలో విద్యుత్ వాహకంగా పనిచేస్తాయట.

అయితే తాను ఇల్లు నిర్మిస్తున్న సమయంలో ఖర్చు ఎంత అయిందని రికార్డ్ చేయలేదని ప్రదీప్ సింగ్ అంటున్నారు. అంతేకాదు తన ఇంటి మోడల్ చూసి ఆసక్తిగల వ్యక్తులు ఇలాంటి ఇంటిని నిర్మించేందుకు తనను సంప్రదించారట. కానీ ఒక్కరు కూడా ఇదే విధంగా ఇంటిని నిర్మించలేదని చెప్పారు.

మామిడి చెట్టు 11 ఏళ్లలో 20 అడుగుల నుంచి 40 అడుగులకు పెరిగింది. ఇంతకుముందు రెండంతస్తులు ఉన్న సింగ్ ఇల్లు ఇప్పుడు మూడు అంతస్థులు అయింది. మొదటి అంతస్తులో వంటగది, బాత్రూమ్ , డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. రెండవ అంతస్తులో, వాష్‌రూమ్, లైబ్రరీ , బెడ్‌రూమ్ ఉన్నాయి. మూడవ అంతస్తు పైకప్పుతో ఒకే గదితో ఉంటుంది. ఈ గాడి నుంచి చూస్తే చెట్టు అందమైన కొమ్మలను చూడవచ్చు. తన భార్య , కొడుకు, ఇలా తన ఫ్యామిలీ సభ్యుల జీవితం ఈ ఇంటిలో సంతోషంగా ఉందని సింగ్ చెప్పారు. తమకు ప్రతి వేసవిలో మామిడికాయలను బహుమతిగా ఇస్తుందని 75 ఏళ్ల ప్రదీప్ సింగ్ సంతోషంగా చెప్తున్నారు.

ఇప్పటికే ఈ ట్రీహౌస్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. అనేక మంది పర్యాటకులు కూడా సందర్శిస్తారు. అజ్మీర్‌లోని అందమైన కోటలు, రాజభవనాలతో పాటు, ఈ అద్భుతమైన ట్రీహౌస్‌ను కూడా తమ పర్యటనలో భాగంగా చేర్చుకున్నారు.