త్వరలో ఈ దేశంలో మహిళలు ఒకరి కంటే ఎక్కువ మంది పురుషులని పెళ్లి చేసుకునే అవకాశం ..!

-

సౌత్ ఆఫ్రికా లో త్వరలో మహిళలు ఒకరి కంటే ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకోవడానికి అనుమతి ఇచ్చేలా ఉన్నారు. ఎలా అయితే పురుషులు ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలని వివాహం చేసుకుంటారో అలానే ఇది కూడా.

మహిళలు
మహిళలు

డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ తాజాగా ఈ నిర్ణయాన్ని ప్రపోస్ చేసింది. దీనిని చూస్తుంటే కొత్త వివాహ చట్టం రాబోతోంది అని తెలుస్తోంది, గ్రీన్ పేపర్ మ్యారేజెస్ ప్రకారం ఇప్పుడు ఉండే వివాహ చట్టం సమానత్వంగా లేదని.. సమానత్వం కోసమే కొత్త నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది. ఈక్వాలిటీ డిమాండ్స్ కి సంబంధించి దీనిని తీసుకురానున్నారు.

ఈ ప్రతిపాదనను రూపొందించడానికి ముందు చాలా మంది మానవ హక్కుల కార్యకర్తలు మరియు ఇతర సమూహాలను ముఖ్య విషయాలపై సంప్రదించారు. ఏదేమైనా, సంప్రదాయవాదులు మరియు కొన్ని మత సమూహాలు ఈ ప్రతిపాదనతో పూర్తి దృష్టి పెట్టాయి.

ఇది ఇళ్ల ఉంటే దక్షిణాఫ్రికా పురుషులకు స్వలింగ వివాహాలు మరియు ఒకరి కంటే ఎక్కువ మహిళలని వివాహం చేసుకోవడానికి అనుమతించినప్పటికీ, చాలా మంది పాలియాండ్రీని వ్యతిరేకించారు, ఇది ‘ఆఫ్రికన్ సంస్కృతిని నాశనం చేస్తుంది’ అని అన్నారు.

ప్రతిపక్ష ఆఫ్రికన్ క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎసిడిపి) నాయకుడు కెన్నెత్ మెషో మాట్లాడుతూ… ఇండిపెండెంట్ లో వచ్చిన నివేదిక ప్రకారం దీనిని ఒప్పుకుంటే ‘సమాజాన్ని నాశనం చేస్తుంది’ అని అన్నారు.

ఇది ఆఫ్రికన్ సంస్కృతిని నాశనం చేస్తుందని. అలానే వాళ్ళ పిల్లల గతి ఏమవుతుంది అని పిల్లల యొక్క ఐడెంటిటీ వాళ్లకు ఎలా తెలుస్తుంది అని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news