ఈ రాశుల వారు దెయ్యాలను ఎక్కువగా నమ్ముతారట

దెయ్యాలంటే అందరికి భయం ఉంటుంది. కానీ కొంతమంది అస్సలు దెయ్యాలను నమ్మరు. అంతా బుల్ షిట్ అని కొట్టిపారేస్తారు. కానీ కొంతమంది పెద్దవారైనా సరే.. దెయ్యాలంటే ఘోరంగా పడతారు. కాంచన మూవీలో హిరో ఎలా అయితే భయపడతాడో అలా..జ్యోతిష్య శాస్ర్తం ప్రకారం కొన్ని రాశుల వారికి కొన్ని సూపర్ నాచురల్ విషయాలు మీద ఎక్కువ నమ్మకం ఉంటుందట. కొందరు ప్రతీదీ ప్రశ్నిస్తారు.. లాజిక్ లేకుండా ఏదీ ఒకపట్టాన నమ్మరు. మరికొంతమందికి నమ్మకాలెక్కువు..ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తుంటారు. కొన్ని రాశుల వారు దెయ్యాలను ఎక్కువగా నమ్ముతారట.. నమ్మటం అంటే భయపడటం రాదండోయ్. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం.

horoscope

1. సింహ రాశి

వీరికి ఈ విషయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువనే చెప్పవచ్చు. మనకి తెలియని దాని గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం వీరికి చాలా ఎక్కువ, కొన్ని విషయాలని వీరు నమ్ముతారు కూడా. అయితే, ఈ విషయాలు ఎంత డీప్‌గా అర్ధం చేసుకోవాలి అనేది మాత్రం పూర్తిగా వారి వ్యక్తిగత విషయం.

2. మిథున రాశి

మనకి తెలియని దాని గురించీ, సూపర్ నాచురల్ విషయాల గురించీ ఈ రాశి వారికి షేర్ చేసుకోవాడిని బోలెడన్ని విషయాలు తెలిసి ఉంటాయి. ఇలాంటి వాటి మీద వారికి నమ్మకం లేకపోయినా కూడా ఈ విషయాలూ, సంగతులూ, సమాచారం సేకరించడం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది..

3. కుంభ రాశి

ఈ రాశి వారికి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది.. కొత్తవి ట్రై చేయడం అంటే ఆసక్తి బాగా ఉంటుందట. అలానే వీరు దెయ్యాల కధలంటే ఉత్సాహంగానే వింటారు కానీ అస్సలు భయపడరు.

4. తులా రాశి

ఈ రాశి వారికి ఈ విషయాలంటే ఎక్కడలేని ఇంటరెస్ట్ ఉంటుంది కానీ ఆ సంగతి పైకి పెద్దగా చెప్పరు. వీరు కూడా సూపర్ నాచురల్ అంటే ఎట్రాక్ట్ అవుతారు కానీ, అందులో ఉన్న సానుకూల భావాలకే వీరు ఎక్కుగా స్పందిస్తారట.

5. మీన రాశి

ఈ రాశి వారికి సూపర్ నాచురల్ విషయాల మీద ఆసక్తి ఎక్కువే అని చెప్పాలి. వీరు ఎక్కువగా పగటి కలలు కంటూ ఉంటారట. ఆ కలల్లో దెయ్యాలు కూడా ఉంటాయి. ఈ సంగతుల మీద వీరు మంచి ఉత్సాహకరమైన కధలు చెబుతారు. ఈ సబ్జెక్ట్ ని ఒక హాబీలా ఎక్స్ప్లోర్ చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.

మిగిలిన రాశుల వారికి దెయ్యాలంటే నమ్మకం లేదని, భయం లేదని కాదు. ఒక్కక్కరు ఒకో మెంటాలిటీలో ఉంటారు. జోతిష్యశాస్ర్రం ప్రకారం ఈ రాశుల వారు కాస్త వీటిపై ఎక్కువు ఆసక్తిగా ఉంటారు అంతే.

– Triveni Buskarowthu