వేసవిలో సహజంగానే దేశంలో అనేక చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అయితే ఈ విషయం వేసవికే పరిమితం కాలేదు. చలికాలంలోనూ పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డవుతాయి. ఈ క్రమంలోనే ఈ సారి గతంలో కన్నా చలి మరింత పెరిగింది. ఇక మన దేశంలో ప్రస్తుతం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లోని లెహ్ ప్రాంతంలో -13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, హిమాచల్ ప్రదేశ్ లోని కైలాంగ్ అనే టౌన్లో ప్రస్తుతం -7.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగత నమోదు అవుతోంది. అలాగే జమ్మూ కాశ్మీర్‌లోని అనంత నాగ్ జిల్లాలో ఉన్న పహల్గమ్ అనే ప్రాంతంలో -6.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగత నమోదవుతోంది.
జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్లో – 6 డిగ్రీలు, శ్రీనగర్‌లో -5 డిగ్రీలు, కుపవరలో -4.5 డిగ్రీలు, కొకెర్నాగ్లో -4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్న అనంతనాగ్ జిల్లా కాజిగుండ్‌లో -4 డిగ్రీలు, హిమాచల్ ప్రదేశ్‌లోని సట్లెజ్ రివర్ వ్యాలీలో ఉన్న కల్ప అనే ప్రాంతంలో -0.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక చివరిగా జమ్మూ కాశ్మీర్‌లోని కాజిగుండ్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనిహల్ అనే ప్రాంతంలో -0.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ ప్రస్తుతం 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం గమనార్హం. దీంతో రానున్న వేసవి కూడా మండిపోతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.