అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన వివో వి20 (2021) స్మార్ట్ ఫోన్‌

-

మొబైల్స్ త‌యారీదారు వివో త‌న వి20 స్మార్ట్ ఫోన్‌కు గాను కొత్త వేరియెంట్‌ను గురువారం విడుద‌ల చేసింది. వివో వి20 (2021) పేరిట ఆ ఫోన్ విడుద‌లైంది. ఇందులో స్నాప్‌డ్రాగ‌న్ 730జి ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్ ఉంది. 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ మోనో సెన్సార్ ల‌ను అమ‌ర్చారు. ముందు వైపు 44 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ను ఇందులో అందిస్తున్నారు. 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఇందులో ఉంది. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.

Vivo V20 (2021) smart phone launched in india

వివో వి20 (2021) ఫీచ‌ర్లు…

* 6.44 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2400×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 730జి ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్
* 1 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆడ్రాయిడ్ 11, డ్యుయ‌ల్ సిమ్
* 64, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 44 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

వివో వి20 (2021) స్మార్ట్ ఫోన్ మిడ్‌నైట్ జాజ్‌, సన్‌సెట్ మెలోడీ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ రూ.24,990 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు అమెజాన్‌లో ల‌భిస్తోంది. అలాగే ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news