దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 3,898 దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ బ్రాంచ్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో పూర్తిగా విలీనం అయ్యాయని బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆ రెండు బ్యాంకులకు చెందిన కస్టమర్లు బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన అన్ని డిజిటల్ మాధ్యమాలను వాడుకునేందుకు వీలు ఏర్పడింది.
అయితే దేనా బ్యాంక్, విజయా బ్యాంక్‌లకు చెందిన కస్టమర్లు తమ డెబిట్ కార్డులను ఎప్పటిలాగే ఉపయోగించుకోవచ్చు. కార్డు ఎక్స్‌పైర్ అయ్యే వరకు పనిచేస్తాయి. అలాగే వారు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఏటీంలను గనక మొదటిసారి ఉపయోగిస్తున్నట్లయితే పిన్ మార్చుకోవాలని ఏటీఎంలో చూపిస్తుంది. కాగా రెండు బ్యాంకులకు చెందిన మొత్తం 5 కోట్ల మంది కస్టమర్ల ఖాతాలను బీవోబీలోకి విజయవంతంగా బదిలీ చేశారు. దీంతో ఆ రెండు బ్యాంక్‌లకు చెందిన బ్రాంచ్‌లు, ఏటీఎంలు, పీవోఎస్ మెషిన్‌లు బ్యాంక్ ఆఫ్ బరోడా కింద పనిచేస్తాయి.
కాగా మూడు బ్యాంకుల కలయికతో బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో ఇప్పటికే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థగా అవతరించింది. దీంతో ఆ బ్యాంకుకు మొత్తం 8,248 బ్రాంచ్‌లు, 10,318 ఏటీఎంలు ప్రస్తుతం ఉన్నాయి. ఇక 2019 ఏప్రిల్ 1 నుంచే విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో డిసెంబర్ 2020 వరకు దేనా బ్యాంక్‌కు చెందిన మొత్తం 1770 బ్రాంచ్‌లో బీవోబీలో విలీనం అవ్వగా, సెప్టెంబర్ 2020 వరకు విజయా బ్యాంక్‌కు చెందిన 2,128 బ్రాంచ్‌లు బీవోబీలో విలీనం అయ్యాయి.