హైదరాబాద్ నుంచి వారణాసికి టూర్ ప్యాకేజీ… ధర కూడా తక్కువే…!

-

భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఇప్పటికే వివిధ టూర్ ప్యాకేజీలని తీసుకు వచ్చింది. చాలా మంది ఈ ప్యాకేజీలని బుక్ చేసుకుంటున్నారు. ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి కాశీకి ఒక ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. ఇక మరి దాని వివరాలని చూసేద్దాం. జై కాశీ విశ్వనాథ్ గంగే పేరు తో ఈ ప్యాకేజీ ని తీసుకు వచ్చారు. 5 రాత్రులు, 6 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ ఇది.

ఈ ప్యాకేజీ లో సార్‌నాథ్, ప్రయాగ్‌రాజ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,000 లోపే వుంది. ప్రతీ ఆదివారం ఈ టూర్ ఉంటుంది. మొదటి రోజు దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. నెక్స్ట్ డే వారణాసి చేరుకుంటారు. సాయంత్రం గంగా హారతి చూడచ్చు.

మూడో రోజు ఉదయం కాశీ విశ్వనాథ్ మందిర్, కాల భైరవ ఆలయం, భూ మందిర్ చూడచ్చు. నాల్గవ రోజు సార్‌నాథ్ చూడచ్చు.ధామేఖ్ స్తూపం, బుద్ధ ఆలయం కూడా కవర్ అవుతాయి. తర్వాత ప్రయాగ్‌రాజ్… దారిలో వింధ్యాచల్ టెంపుల్ ని చూడచ్చు. రాత్రికి ప్రయాగ్‌రాజ్‌లో స్టే చెయ్యాలి. ఐదో రోజు త్రివేణి సంగమం ఉంటుంది.

ఆనంద్ భవన్, ఖుస్రో భాగ్ చూడచ్చు. రాత్రి 7.45 గంటలకు ట్రైన్ ఎక్కితే మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు సికింద్రాబాద్ రీచ్ అవుతారు. ధర విషయానికి వస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.9,870, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.11,750 పే చెయ్యాలి. కంఫర్ట్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.12,880, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.14,760 చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Latest news