ప్రపంచంలోని పలు నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలుసు. ట్రాఫిక్ ను తప్పించుకోవడం కోసమే.. ఎగిరే టాక్సీలను ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల ప్రయాణం సులువవుతుంది.
ఉబర్ ఇప్పటికే ఆటోలు, క్యాబ్ లు, టాక్సీల సర్వీసులను ప్రపంచ వ్యాప్తంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. యాప్ ద్వారా చిటికెలో క్యాబ్ ను బుక్ చేసుకొని వెళ్లొచ్చు. అయితే.. త్వరలో ఉబర్ నుంచి ఫ్లయింగ్ టాక్సీలు రానున్నాయట. అంటే గాల్లో ఎగిరే టాక్సీలు అన్నమాట. ఫ్లయింగ్ టాక్సీ సేవలను ముందుగా ఆస్ట్రేలియాలో తీసుకురానుంది ఉబర్.
ఆస్ట్రేలియాతో పాటు యూఎస్ లోని డల్లాస్, లాస్ ఏంజెల్స్ లో ఉబర్ టాక్సీలు రానున్నాయి. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో 2020 నుంచి టెస్ట్ ఫ్లయిట్లను ప్రారంభించనున్నారు. 2023 నాటికి అక్కడ పూర్తి స్థాయిలో సేవలను అందించనున్నారు. ప్రస్తుతం చాలా కంపెనీలు ఫ్లయింగ్ టాక్సీలను తయారు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఫ్లయింగ్ టాక్సీలదే రవాణాలో కీలక పాత్ర కానున్న నేపథ్యంలో ఉబర్ ఈ నిర్ణయం తీసుకుంది.
ట్రాఫిక్ సమయాల్లో ఫ్లయింగ్ టాక్సీలకే గిరాకీ
ప్రపంచంలోని పలు నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలుసు. ట్రాఫిక్ ను తప్పించుకోవడం కోసమే.. ఎగిరే టాక్సీలను ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల ప్రయాణం సులువవుతుంది.
ఉదాహరణకు మెల్ బోర్న్ లో ఉన్న విమానాశ్రయానికి మెల్ బోర్న్ నగర నడిబొడ్డు నుంచి కారులో వెళ్లాలంటే గంట సమయం పడుతుంది. అదే ఎయిర్ టాక్సీ ద్వారా 10 నిమిషాల్లో చేరుకోవచ్చు.
ఎయిర్ టాక్సీల కోసం ఉబర్ నాసా, యూఎస్ సైన్యంతో కలిసి పనిచేస్తోంది. ఎయిర్ టాక్సీలను ఎంబ్రేర్, పిపిస్ట్రెల్ ఎయిర్ క్రాఫ్ట్ అనే విమానాలను తయారు చేసే సంస్థలు దీన్ని తయారు చేస్తున్నాయి.
అయితే.. ఎయిర్ టాక్సీల కోసం ప్రయోగాలు చేస్తున్న కంపెనీల్లో ఎయిర్ బస్ కూడా ఒకటి. అది కూడా ఫ్లయింగ్ టాక్సీలను ప్రవేశపెట్టాలని చూస్తోంది. మరికొన్ని కంపెనీలు కూడా ఫ్లయింగ్ టాక్సీలను టెస్ట్ చేస్తున్నాయి.