రేణు దేశాయ్ రెండో పెళ్లి ఏర్పాట్లు.. వరుడితో ఫోటో షూట్

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లిపై ఎవ్వరకీ క్లారిటీ లేదు. గత సంవత్సరంలోనే ఆమె నిశ్చితార్థం జరిగింది. తన చిన్ననాటి స్నేహితుడిని ఆమె వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆయన ఫోటోలు మాత్రం ఇప్పటి వరకు సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.

నిశ్చితార్థం అయితే జరిగింది కానీ.. తన పెళ్లి గురించి మాత్రం ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు రేణు. దీంతో తన రెండో పెళ్లి క్యాన్సిల్ అయిందంటూ అందరూ అనుకున్నారు. సోషల్ మీడియాలో కూడా తన రెండో పెళ్లిపై ఎన్నో పోస్టులు వచ్చాయి.అయితే.. తన రెండో పెళ్లిపై రేణు మరోసారి క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి ఆగిపోలేదని.. తన పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఓ హింట్ ఇచ్చింది. తన కాబోయే భర్తతో కలిసి ఉన్న ఫోటోను కూడా ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. కాకపోతే.. ఆయన కాళ్లు మాత్రమే కనిపిస్తుండగా.. ఆయన కాళ్ల మీద రేణు సేదతీరుతూ కనిపిస్తుంది రేణు.

ఆ ఫోటోను అకీరా తీశాడంటూ క్యాప్సన్ పెట్టింది రేణు. అంటే.. రేణు దేశాయ్ పెళ్లి ఆగలేదన్నమాట. పెళ్లి ఏర్పాటు జరుగుతున్నాయని చెప్పడం కోసమే రేణు ఆ ఫోటో పెట్టి ఉంటుందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version