మాస్కు ఉన్నా.. ఐఫోన్‌ లాక్‌ ఇలా తీయొచ్చు!

దిగ్గజ కంపెనీ యాపిల్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకుచ్చి తమ వినియోగదారులని ఆకర్శిస్తోంది. అదే విధంగా ఇప్పుడు కూడా ఒక నయా ఫీచర్‌తో ముందుకు వచ్చింది. అదేంటంటే ప్రస్తుత కొవిడ్‌ వైరస్‌ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్కు వేసుకోవాలన్న నిబంధనలు పాటిస్తున్నారు. అయితే, మాస్కు వేసుకున్న ఫేస్‌ ఐడీని గుర్తించగలిగే కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐఓఎస్‌ 14.5 వెర్షన్‌ ద్వారా ఇకపై మాస్కు తీయకుండనే ఫేస్‌ ఐడీని సులభంగా గుర్తించే అప్డేట్‌ వచ్చేసింది.

అంతేకాదు, మీ స్మార్ట్‌వాచ్‌ను యాపిల్‌ ఫోన్‌కు కనెక్ట్‌ చేసి కూడా లాక్‌ తీసే వెలుసుబాటు కూటా ఉంది. సాధారణంగా ఫేస్‌ ఐడీ తీయడానికి మన ముఖానికి ఏది అడ్డుగా ఉండకూడదు, లేకపోతే పాస్‌కోడ్‌ ద్వారా అన్‌లాక్‌ చేయాల్సి ఉంటుంది. ఫేస్‌ లాక్‌ ద్వారా పాస్‌కోడ్‌ తీసే అలవాటు ఉన్నవారికి కోడ్‌ ఎంటర్‌ చేయడం అనేది కాస్త చిరాకు తెప్పిస్తుంది. ఇక ఇప్పటి నుంచి ఈ అవసరం లేదు. మాస్కుతో సహజీవనం చేయాల్సిన ప్రస్తుత పరిస్థితిలో ఇటువంటి ఫీచర్‌తో ముందుకు రావడం ఛాలేంజ్‌తో కూడిన విషయం. అయితే, దీనికి మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి. యాపిల్‌ వాచ్‌ ద్వారా అన్‌లాక్‌ చేయాలంటే యాపిల్‌ ఫోన్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఒకవేళ మీ వద్ద మ్యాక్, యాపిల్‌ వాచ్‌లు ఉంటే ఇక పని చాలా సులభతరం అవుతుంది.
స్మార్ట్‌ వాచ్‌ లాక్‌ ఓపెన్‌ చేయాల్సినప్పుడు మీరు ఒకవేళ మాస్కు ధరించి ఉంటే ఐఫోన్‌ స్క్రీన్‌ను కింది నుంచి పైకి స్వైప్‌ చేయాలి. అప్పుడ మీ ఐఫోన్‌ మీ ఫేస్‌ను క్యాప్చర్‌ చేస్తుంది. ఆ వెంటేనే యాపిల్‌ వాచ్‌ ద్వారా అన్‌లాక్‌ చేయబడింది అనే ఫీడ్‌బ్యాక్‌ వెంటనే వస్తుంది. ఇది కేవలం మీ వద్ద యాపిల్‌ వాచ్, ఐఫోన్‌ కాంబినేషన్‌లో మాత్రమే సాధ్యంమవుతుంది.