Aadhaar Card Update: ఆధార్ లో ఫోటో మార్చుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి..!

-

ఆన్ లైన్ లో మాత్రం ఫోటో మార్చడం కుదరదు. సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్ ద్వారా ఫోటోను మార్చాలంటే.. ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ నుంచి ఎన్ రోల్ మెంట్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకొని దాన్ని మొత్తం నింపి ఆ ఫామ్ ను దగ్గర్లోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కు తీసుకెళ్లి సబ్మిట్ చేయాలి..

ఆధార్ కార్డు… ప్రతి భారతీయుడికి ఉండాల్సిన కార్డు. డబ్బులు సంపాదించినా సంపాదించకున్నా ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఆధార్ కార్డుకు అంత విలువ. ప్రతి దానికి ఆధార్ కార్డు సమర్పించాల్సిందే. అందుకే ఆధార్ కార్డులో అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

అయితే.. చాలామందికి తమ ఆధార్ కార్డులో ఫోటో సరిగ్గా ఉండదు. ఆధార్ కార్డుపై ఉండే ఫోటోకు, ఒరిజినల్ ఫోటోకు చాలా తేడా ఉంటది కదా. కానీ.. ఆధార్ కార్డులో ఉన్న ఫోటోను ఎలా మార్చుకోవాలో మాత్రం చాలామందికి తెలియదు.

కానీ.. ఆధార్ కార్డులోకి ఫోటోను కూడా మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ కార్డులో ఉన్న ఫోటోను మార్చుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్ ద్వారా, మరోటి ఎన్ రోల్ మెంట్ సెంటర్ దగ్గర. ఈ రెండింటి ద్వారా ఆధార్ కార్డులో ఫోటోను మార్చుకోవచ్చు.

ఆన్ లైన్ లో మాత్రం ఫోటో మార్చడం కుదరదు. సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్ ద్వారా ఫోటోను మార్చాలంటే.. ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ నుంచి ఎన్ రోల్ మెంట్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకొని దాన్ని మొత్తం నింపి ఆ ఫామ్ ను దగ్గర్లోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కు తీసుకెళ్లి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ ముఖాన్ని క్యాప్చర్ చేసి లేటెస్ట్ ఫోటోతో మీ ఆధార్ కార్డును సబ్మిట్ చేస్తారు. దాని కోసం 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ పెట్టిన 15 నుంచి 20 రోజుల్లోపల మీ ఆధార్ కార్డులో కొత్త ఫోటో అప్ డేట్ అవుతుంది.

ఒకవేళ మీరు వెబ్ సైట్ నుంచి ఫాం డౌన్ లోడ్ చేసుకోలేకపోతే.. ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కు వెళ్లి అక్కడ ఫోటో అప్ డేట్ ఫాం అంటే ఇస్తారు. దాన్న నింపి 25 రూపాయలు కట్టి లేటెస్ట్ ఫోటోను అప్ డేట్ చేసుకోవచ్చు.

మీకు ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కు వెళ్లే సమయం లేకపోతే… యూఐడీఏఐ ఆఫీస్ కు లెటర్ పంపించి కూడా అప్ డేట్ చేసుకోవచ్చు. యూఐడీఏఐ వెబ్ సైట్ నుంచి ఆధార్ డేటా అప్ డేట్ కరెక్షన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. వివరాలను ఫామ్ ను నింపి… ఆధార్ ఫోటో మార్పు కోసమని దరఖాస్తు పెట్టాలి. దరఖాస్తుతో పాటు కొత్త ఫోటో, ఆధార్ కార్డు జీరాక్స్ ను జతపరచాలి.

Read more RELATED
Recommended to you

Latest news