గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్.. మీ వాహనం స్పీడ్ కూడా చెప్పేస్తుంది..!

ఈ ఫీచర్ తో మీరు మీ వాహనం మీద ఎంత స్పీడ్ గా వెళ్తున్నారో తెలుసుకోవచ్చు. అంటే మీ వాహనం స్పీడ్ ను గూగుల్ మ్యాప్స్ లో చూసుకోవచ్చన్నమాట. అయితే… ఈ ఫీచర్ ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి రాలేదు.

గూగుల్.. ప్రపంచంలోనే నెంబర్ వన్ కంపెనీ. దీన్ని బీట్ చేసేవాళ్లు లేరు. టెక్ దిగ్గజ కంపెనీ ఇది. నేడు ఇంటర్నెట్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి పరిచయమున్న పేరు ఇది.

అయితే.. చాలామంది ఎక్కడికైనా వెళ్లాలన్నా.. రూట్ తెలియకున్నా… గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి పెడతారు. దీంతో డెస్టినేషన్ ప్లేస్ ఎంటర్ చేస్తే ఎక్కడికి వెళ్లాలో అది చెబుతుంది. గూగుల్ మ్యాప్స్ లోనూ ఎన్నో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా గూగుల్ మ్యాప్స్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ ఫీచర్ తో మీరు మీ వాహనం మీద ఎంత స్పీడ్ గా వెళ్తున్నారో తెలుసుకోవచ్చు. అంటే మీ వాహనం స్పీడ్ ను గూగుల్ మ్యాప్స్ లో చూసుకోవచ్చన్నమాట. అయితే… ఈ ఫీచర్ ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి రాలేదు. ఈ ఫీచర్ కావాలనుకునేవాళ్లు.. యాప్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లి నావిగేషన్ సెట్టింగ్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ స్పీడో మీటర్ ఆప్షన్ ను ఓకే చేయాలి.

అయితే.. అన్ని ఏరియాల్లో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. మీ స్పీడ్ ను తెలుసుకోవడంతో పాటు.. స్పీడ్ లిమిట్స్ ను కూడా ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు.