వీడియో వైరల్‌: పిల్లికూనకు పాలిచ్చిన శునకం..!

Join Our Community
follow manalokam on social media

అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు చూస్తూనే ఉంటాం. బద్ధ శత్రువులు కూడా అప్పుడప్పుడు మిత్రువులుగా కలిసిపోతుంటారు. అలాంటి వీడియోలు కానీ ఫోటోలు చూసినప్పుడు ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా కుక్కలకు, పిల్లులకు పడదు. కుక‍్కలు పిల్లులను చూస్తే చాలు లగెత్తాల్సిందే. కానీ ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఓ పిల్లికూన రోడ్డుపై పడుకున్న ఓ కుక్క పాలు తాగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

dog

ఈ వీడియోని చూస్తుంటే.. పిల్లి కూనకు బాగా ఆకలేసినట్లు కనిపిస్తుంది. వెంటనే రోడ్డుపక్కల విశ్రాంతి తీసుకుంటున్న కుక్క దగ్గరికి వెళ్లి పాలు తాగడం మొదలు పెడుతుంది. అది చూసిన కుక్క కూడా పిల్లిని చూసి ఏమి అనకపోవడం గమనార్హం. కుక్క ప్రశాంతంగా నిద్రిస్తూ.. పిల్లికూన ఆకలిని తీర్చింది. ఈ ఘటన నైజీరియా దేశంలో చోటు చేసుకుంది.

ఆకలి విలువ అమ్మకే తెలుస్తుందని అంటుంటారు. ఈ విషయంలో జాతి వైరం కనిపించదు. దీనికి నిదర్శనం ఈ వీడియోనేనని నెటిజన్లు చెబుతున్నారు. పిల్లికూనకు పాలిస్తున్న అరుదైన దృశ్యాన్ని చూసేందుకు అక్కడి స్థానికులు ఒక్కసారిగా గుమిగూడారు. మొబైళ్లలో వీడియోని బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. రూథర్స్‌ అనే వార్త సంస్థ తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తుంది. అప్లోడ్‌ చేసినా ఇప్పటివరకు 4 లక్షల మందిపైగా వీడియో చూశారు. 463 మందికిపైగా రీట్వీట్‌లు చేయగా.. 2 వేలకుపైగా మంది లైకులు కొట్టారు. జాతివైరం ఉన్న జంతువులే జాలిని కలిగి ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆకలి తీర్చిన శునకం.. కడుపు నింపుకున్న పిల్లకూన అంటూ వీడియో చూస్తున్న ప్రతిఒక్కరూ సంబరపడుతున్నారు.

TOP STORIES

రంజాన్ నెల ప్రారంభం.. విశేషాలు.. ప్రాముఖ్యత.. కొటేషన్లు..

రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల 14వ తేదీ నుండి మే 12వరకు రంజాన్ నెల ఉంటుంది. పవిత్రమాసమైన ఈ నెలలో ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో...