ట్రాఫిక్ సిగ్నల్ గురించి మనకు బాగానే ఐడియా ఉండే ఉంటుంది. దాంతోపాటు..కొన్ని చేతి సిగ్నల్స్ ద్వారా మనం ఏదైనా ప్రమాదంలో ఉంటే..ఎటుటివారికి నోటితో కాకుండా ఇలా సైగ చేసి చెప్పవచ్చు. ప్రమాదంలో ఉంటే…నోరుతెరిచి అడగటానికే ఏమైనా మొఖమాటమా ఏంటి..సైగ చేయటానికి అనే డౌట్ వస్తుందా. ఒకసారి కొన్ని థ్రిలర్ మూవీస్ గుర్తుచేసుకోండి..కిడ్నాప్ లాంటివి చేసినప్పుడు జనాల్లోకి తీసుకెళ్తారు..కానీ వారు కాపాడమని ఎవర్ని అడగలేరు..అడిగితే మనల్ని వీళ్లు ఏదైనా చేయొచ్చు..అందుకే వాళ్లు కళ్లలో భయం చూసో మరేదైన చేసో హీరోకు అర్థమయ్యేలా డైరెక్టర్ చేస్తాడు. అలాంటి పరిస్థితులు నిజ జీవితంలో వస్తే.. ఒక ప్రత్యేకమైన చేతిసంజ్ఞ ద్వారా మనం ప్రమాదంలో ఉంటే చెప్పొచ్చు..అయితే ఈ విషయం పై రెండువైపులా అవగాహన ఉండాలికదా..తాజాగా ఓ 16 ఏళ్ల బాలిక చేతిసంజ్ఞ ద్వారా ప్రమాదం నుంచి బయటపడింది. అది ఎలానో ఇప్పడు చూద్దాం.
కిడ్నాప్ అయిన 16 ఏళ్ల బాలిక కెంటుకీలోని హైవేపై కారులో వెళ్తుండగా అక్కడ ఆమె ప్రత్యేకమైన చేతి సిగ్నల్‌తో ఇతర డ్రైవర్లకు చూపించింది. కానీ చాలామందికి అది అర్థం కాలేదు. ఒక డ్రైవర్ మాత్రం గుర్తుపట్టాడు. ఆ గుర్తుకు అర్థం ఆమెకు తక్షణమే సహాయం అవసరమని. కోవిడ్ మహమ్మారి సమయంలో లాక్ డౌన్ ఉన్నప్పుడు ఇంట్లో గృహహింసలు బాగా ఎక్కువయ్యాయి. అప్పుడు బాధితులకు సహాయం చేసే ప్రయత్నంలో ఓ కెనడియన్ ఉమెన్స్ ఫౌండేషన్ ఈ చేతి సంకేతం రూపోందించింది. ఇది సోషల్ మీడియా ద్వారా బాగానే వైరల్ అయింది.
ఆ వీడియోస్ కూడా టిక్‌టాక్ లో బాగా వైరల్ అయ్యాయి. అలా ఆ అమ్మాయి సిగన్ల ను ఆ డ్రైవర్ గుర్తుపట్టగలిగాడు. వెంటనే 911కి కాల్ చేసి, దాని గురించి తెలియని పోలీసులకు సిగ్నల్‌ని వివరించిన తర్వాత, షెరీఫ్ అధికారి తన సహాయకులతో పరిశోధించడానికి బయలుదేరి వెళ్లినట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.
షెరీఫ్ తన బృందంతో కలిసి మొత్తానికి N.C.కి చెందిన డ్రైవర్ జేమ్స్ హెర్బర్ట్ బ్రిక్,( 61) ను అదుపులోకి తీసుకున్నారు. అతనికి జైలు శిక్ష విధించారు. తన ఫోన్‌లో పిల్లల అశ్లీల చిత్రాలు ఉన్నాయని అక్కడి అధికారులు వెల్లడించారు.
నార్త్ కరోలినా, టేనస్సీ, కెంటుకీ మరియు ఒహియోల గుండా తాను మిస్టర్ బ్రిక్‌తో కలిసి ప్రయాణించానని బాధిత బాలికి అధికారులకు తెలిపింది. కెనడియన్ ఉమెన్స్ ఫౌండేషన్ సిగ్నల్‌ను చూసే ఎవరైనా వెంటనే అధికారులను పిలవాల్సిన అవసరం లేదని, బదులుగా వీలైతే వారే వెళ్లి ఉపయోగించిన వ్యక్తిని కాపాడాలని తెలిపింది.
మొత్తానికి ఆ బాలిక చేతి సంజ్ఞతో రక్షించబడింది. ఈ సిగ్నల్ పై వీలైనంత మందికి అవగాహన ఉంటే అందరూ త్వరగా గర్తుపట్టగలుగుతారు. ఈ కింది వీడియోలో కూడా మీకు క్లియర్ గా చూపించారు గృహిహింసకు గురవుతున్న ఆమె తన ఆత్మీయులకు ఎలా ఆ విషయాన్ని చెప్పిందో మీరు ఈ వీడియోలో చూడండి. .