సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్ట్… భవన నిర్మాణంలో పలువురి మోసం

-

సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భవన నిర్మాణం విషయంలో పలువురిని మోసం చేయడంతో పోలీసులు చీటింగ్ కేసును నమోదు చేశారు. భవన నిర్మాణ విషయంలో పలువురి దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి కొనుగోలుదారులను మోసం చేసినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నానక్ రాంగూడ లోని సర్వే నెంబర్ 104లో శ్రీధర్ రావుకు ఐదెకరాల భూమి ఉంది. ఆ భూమి అమ్మకం విషయంలో మమ్మల్ని మోసం చేశారంటూ బాధితులు ఫిర్యదులు చేశారు. భూమి అమ్మకం జరిగినప్పుడు తమకు రావాల్సిన డబ్బలు ఇవ్వకుండా మోసం చేశారని.. డబ్బులు అడిగితే గన్ మెన్లను చూపించి భయపెడుతున్నారని బాధితులు పేర్కొన్నారు. మరికొంత మందికి ప్లాట్స్ నిర్మాణం పూర్తయినా.. అప్పగించలేదు. మరికొందరికి పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదని గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి పోలీస్ స్టేషన్లలో ఇప్పటికి ఏడు ఫిర్యాదులు నమోదయ్యాయి.

నానక్ రాంగూడా సర్వే నెంబర్ 104/3లో 5 ఎకరాలు అమ్మిన విషయంలో కమీషన్ డబ్బులు ఇవ్వలేదని మహేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే..రాయదుర్గం పాన్ మక్తా సర్వే నెంబర్ 83లో కట్టిన కమర్షియల్ బిల్డింగ్ లో ఐటీ కంపెనీ కోసం 11 కోట్లు చెల్లించినా తనకు హ్యండోవర్ చేయలేదని మరొకరు ఫిర్యాదు చేశారు.హైదరాబాద్, బెంగళూర్ లలో సెల్లార్ వర్క్ చేస్తే డబ్బులు ఇవ్వలేదని మరో వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో అన్ని ఫిర్యాదులు పరిశీలించి రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news