వైరల్ వీడియో: ముంబై వీధుల్లో అతిపెద్ద హల్వా పరోటా.. టేస్ట్ చేయాల్సిందే..

-

మనదేశంలో వీధుల్లో దొరికే ఆహారానికి చాలా ప్రత్యేకత ఉంది. మనకు తెలియని చాలా రుచులు వీధుల్లో దొరికే బండ్లమీదే దొరుకుతాయంటే అతిశయోక్తి కాదు. అదేంటో గానీ ఒక్కోసారి మనమెంత ప్రయత్నించినా వీధిలో చేసినంత రుచిగా చేయలేకపోతాం. దానికి కారణాలేంటనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఐతే ఇప్పటివరకు ఎన్నో రకాల వీధి ఆహారాలను తిని ఉంటారు. గత కొన్ని రోజులుగా అంతర్జాలంలో ట్రెండ్ అవుతున్న వీడియోలని పరిశీలిస్తూ ఉండి ఉంటారు కూడా.

గాల్లో ఎగిరే దోస, రజనీకాంత్ స్టైల్ దోస సహా అనేక వైరల్ ఫుడ్ వీడియోలు వచ్చాయి. తాజాగా అతిపెద్ద పరోటా వీడియో వైరల్ అవుతుంది. ఇది కూడా ముంబై వీధుల్లోదే కావడం విశేషం. ఫేస్ బుక్ పేజీ స్ట్రీట్ ఫుడ్ రెసిపీస్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. ముంబైలోని మాహిమ్ వీధుల్లోని ఒకానొక వీధి వ్యాపారి వీడియో ఇది. హల్వా జోడీగా తినే పరోటా అత్యంత పెద్దదిగా ఉండడమే దీని విశిష్టత. మైదాతో తయారు చేసే ఈ పరోటా, మామూలు పరోటాలు ఆరు కలిస్తే ఎంత పెద్దగా ఉంటుందో అంతలా ఉంది.

ఈ పూర్తి పరోటాని వేయించడానికి ప్రత్యేక పెనం కూడా ఉంది. చేతులను అటూ ఇటూ ఆడిస్తూ పెద్ద్దదిగా చేసి, నెయ్యిలో వేయిస్తారు. పూర్తిగా కాలిన తర్వాత పక్కన పెడతారు. తర్వాత దీన్ని ప్లేట్లోకి బదిలీ చేయబడుతుంది. హల్వా, ఎండు పండ్లతో చేసిన ఒకానొక ప్రత్యేకమైన దానితో అందిస్తారు. హల్వా పరోటాగా పిలవబడే ఈ పరోటాకి గిరాకీ ఎక్కువ. ఐతే ఆన్ లైన్లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన కొందరు, చేతుల మీద చేయడం కరెక్ట్ కాదని, దానివల్ల శుభ్రంగా ఉండట్లేదని చెప్పగా, మరికొందరు నెయ్యి ఎక్కువ వాడుతున్నారని, అంతలా నెయ్యి తినడం ఆరోగ్యకరం కాదని అంటున్నారు. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరేమంటారో!

https://www.facebook.com/watch/?v=904248356801269

Read more RELATED
Recommended to you

Latest news