హోమ్ లోన్ భారం తగ్గించుకోవాలనుకుంటున్నారా.. ఈ ఐడియాలు మీకోసమే…!

-

ప్రతి మధ్య తరగతి కుటుంబాలకు ఉండే భారం ఇంటి రుణం. నెల నెల వడ్డి రేట్లు కట్టుకోలేక తక్కవ వడ్డి ఉన్న బ్యాంకులను చూసి అయ్యో అని బాధ ప‍డటం మాములే. అలా కనీసం 15 – 20 ఏళ్ల పాటు దీర్ఘకాలం వాయిదాలు (EMI) చెల్లించాల్సిన గృహ రుణం భారం తగ్గించుకునే ఉపాయాలు చాలా ఉన్నాయి. ఇవి మీ కోసమే..కనీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోం‍డి.. ఎదైనా బ్యాంక్ లో రుణం తీసుకునే ముందు పూర్తి స్థాయి విచారణ చేశాకే రుణం తీసుకోండి.

వాటిలో ప్రధానమైనది గృహ రుణం బదిలీ అంటే హోం లోన్ స్విచ్చింగ్ అంటారు. బోలెడంత విచారించి ఏదో బ్యాంకులో హోం లోన్ తీసుకున్నారనుకోండి, సవరణలో భాగంగా మరో బ్యాంకులో హోం లోన్ పై తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేస్తుంటే బాధపడతాం. ఇక అలాందేమి ఉండదు. కేవలం 15 రోజులపాటు ఓపిక చేసుకుని కొన్ని ఫార్మాలిటీలు పూర్తి చేయగలిగితే తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుకు మన హోం లోన్ ను బదిలీ చేసేయవచ్చు. కాకపోత్ చేయాల్సిందల్లా పక్కా పేపర్ వర్కు ఉండేలా చూసుకోవటమే. ఇలా చేస్తే లక్షల్లో వడ్డీ చెల్లింపులను ఆదా చేసుకుని, త్వరగా హోం లోన్ తీర్చేసుకోవచ్చన్నమాట. కేవలం 0.75 శాతం వడ్డీ తగ్గినా 10 – 20 ఏళ్లపాటు చెల్లించే హోం లోన్ ఈఎంఐల్లో లక్షల రూపాయాల భారం తగ్గుతుందంటే మంచిదేగా.

ఇలా లోన్ స్విచ్ చేసుకోవాలంటే పూర్తీ చేయాల్సిన ఫార్మాలిటీలు కూడా తెలుసుకోవాల్సిందే. మొదట లోన్ తీసుకున్న బ్యాంకులో నో అబ్జెక్షన్ తీసుకుని అసలు, బాకీ ఎంత ఉన్నాయో వంటి వివరాలు తీసుకోవాలి. లోన్ తీసుకోవాలనుకున్న బ్యాంక్ బ్రాంచ్ లో ఈ లోన్ అకౌంట్ స్టేట్మెంట్స్, రిజిస్టర్డ్ అగ్రీమెంట్ వంటివి సమర్పిస్తే, పాత రుణం తీరిపోయినట్టే. అప్పుడు మీకు కొత్త హోం లోన్ వస్తుంది. ఈ లోన్ మొత్తాన్ని పాత బ్యాంకుకు కట్టేస్తే, కొత్త ఈఎంఐలు మరో బ్యాంక్ లో మొదలవుతాయి.

ఇక ప్రాసెసింగ్ ఫీ, లీగల్ ఫీ, స్టాంప్ డ్యూటీ, ఎస్టిమేషన్ చార్జెస్ వంటివి తప్పవు. హోం లోన్ తీసుకునేందుకు ఇదే అత్యుత్తమ సమయం. ఎందుకంటే ఇటు ప్రభుత్వ బ్యాంకులు అటు ప్రైవేటు బ్యాంకులు అన్నీ అత్యల్ప వడ్డీ వసూలు చేస్తూ హోం లోన్లు ఆఫర్ చేస్తున్నాయి. మరేందుకు ఆలస్యం మీరు కూడా మీ సోంత ఇంటి కలలను సాకారం చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news