వీసా లేకుండా విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా..? ఈ దేశాలకు వెళ్లొచ్చు

-

చాలామందికి ట్రావలింగ్‌ అంటే ఇష్టం ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గరకు వెళ్లాలి అని ప్లాన్‌ చేస్తుంటారు. ఇండియాలో అయితే ఏ ప్లేస్‌కు అయినా వెళ్లొచ్చు. కానీ విదేశాలకు వెళ్లాలంటే.. వీసా కావాల్సిందే. వీసా లేకుండా దేశం దాటలేం అని చాలా మంది అనుకుంటారు. కానీ వీసా లేకుండా కూడా విదేశాలకు వెళ్లొచ్చు. కొన్ని దేశాల్లో ఈ ఫెసిలిటీ ఉంది. మీరు అక్కడికి వెళ్లాలంటే.. ఎలాంటి వీసా అక్కర్లేదు. హ్యాపీగా వెళ్లేసి రావొచ్చు. ఇంతకీ ఆ దేశాల్లో ఏంటో చూద్దామా..!

బార్బడోస్ ప్రకృతి అందాలను నెలవు.. ఈ అందమైన దేశం, ఇది పసిఫిక్ మహాసముద్రం యొక్క పశ్చిమ భాగంలో కరేబియన్ ద్వీపంలో ఉంది. మీరు భారతీయ పాస్‌పోర్ట్‌తో వీసా లేకుండా ఇక్కడ ప్రయాణించవచ్చు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ 1 బార్బడోస్ డాలర్ విలువ మన కరెన్సీలో దాదాపు 41 రూపాయలు.

ఇక రెండోది నేపాల్.. ఇక్కడకు వెళ్లాలన్నీ మీకు ఎలాంటి వీసా అవసరం లేదు. ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డును చూపవచ్చు. మీరు ఢిల్లీ నుండి విమానంలో వెళుతున్నట్లయితే, మీరు 12 వేల నుండి 15 వేల ఖర్చులో సులభంగా ప్రయాణించవచ్చు. నేపాల్ 1 రూపాయి విలువ భారతదేశం యొక్క 0.63 రూపాయలకు సమానం.

భూటాన్ వెళ్లడానికి కూడా భారతీయులకు వీసా అవసరం లేదు. మీరు రోడ్డు, విమానం, రైలు ద్వారా కూడా భూటాన్ చేరుకోవచ్చు. భూటాన్ కరెన్సీకి భారత కరెన్సీతో సమానమైన విలువ ఉంది.

మీరు వీసా లేకుండా గరిష్టంగా 90 రోజులు మారిషస్‌లో ఉండొచ్చు..ఇక్కడ 1 మారిషస్ రూపాయి విలువ రూ.1.78కి సమానం.

వీటితో పాటు ఇండోనేషియా, కాంబోడియా, ఫిజి, జమైకా, కజికిస్తాన్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో వంటి దేశాలకు కూడా వీసా లేకుండా వెళ్లొచ్చు. ఇంట్రస్ట్‌ ఉండి పైసలు దండిగా ఉంటే.. సంవత్సరానికి ఒక దేశం చొప్పున వెళ్లేసి రావొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news