లోన్ తీసుకొని పెళ్లి చేసుకున్నా.. జబర్దస్త్ యాంకర్ అనసూయ

సినిమా అంటేనే రంగుల ప్రపంచం. సినిమా రంగంలో పేరు సంపాదించాలన్నా.. చేతినిండా సినిమాలు, షోలు ఉండాలన్నా అంత ఈజీ కాదు. దాని వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. ఎంతో శ్రమ ఉంటుంది.

జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి మీకు ఏం తెలుసు.. మీకు నాణేనికి ఒకవైపే తెలుసు. తను యాంకర్. అందంగా ఉంటుంది. చేతినిండా షోలు. ఫుల్లు డబ్బులే డబ్బులు అని మీరు అనుకుంటారు. అయితే.. ఆమె.. ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ హోదా.. అంత ఈజీగా వచ్చింది కాదు. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నది అనసూయ. నాణేనికి మరో వైపు ఉన్న అనసూయ గురించి ఇవాళ తన బర్త్‌డే సందర్భంగా తెలుసుకుందాం పదండి..

we took loan for our marriage, shocking comments by anasuya bharadwaj

సినిమా అంటేనే రంగుల ప్రపంచం. సినిమా రంగంలో పేరు సంపాదించాలన్నా.. చేతినిండా సినిమాలు, షోలు ఉండాలన్నా అంత ఈజీ కాదు. దాని వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. ఎంతో శ్రమ ఉంటుంది. కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇలాంటి ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి.. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నా.

ఇప్పుడు నేను ఉన్న ఈ స్థాయిని చూసి.. మేం చాలా ఉన్నవాళ్లం అని అనుకునేరు. మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్న సెల్ఫ్ ఎంప్లాయ్. మాతో ఎక్కువగా ఉండేవాడు కాదు. ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చేవాడు. అమ్మే మమ్మల్ని పెంచి పెద్ద చేసి ఈ స్థానం దక్కేలా చేసింది. ఒక్కోసారి నాన్న ఖర్చులకు కూడా పంపేవాడు కాదు. అప్పుడు అమ్మే ఆ పని ఈ పని చేసి మాకు అన్నీ కొనిచ్చేది. స్కూల్ ఫీజు కూడా తనే కట్టేది. బట్టలు కూడా అమ్మే కొనిచ్చేది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా నాన్న నాకు కొనిచ్చిన డ్రెస్సులు రెండంటే రెండు జతలు అంతే. ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ స్టార్ డమ్ అంతా మా అమ్మ చలువే.

నాకు ఎంత మంచి అమ్మ దొరికిందో.. అంతకంటే మంచి భర్త దొరికాడు. మా పెళ్లి కూడా లోన్ తీసుకొని చేసుకున్నాం. ఇంట్లో నుంచి ఒక్క పైసా తీసుకోలేదు. ఇద్దరం పెళ్లి చేసుకోవలనుకున్నాం. చేసుకున్నాం అంతే.. అంటూ చెప్పుకొచ్చింది బర్త్‌డే గర్ల్.