నవగ్రహాల వద్ద దీపారాధన ఈ రాశులకు శుభప్రదం! మే 16 రాశిఫలాలు

మేషరాశి : అన్ని అనుకూలాలే. ఆకస్మిక ప్రయాణాలు, స్త్రీ సుఖం, పనులు పూర్తి, విజయం, లాభం, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేసుకోండి సరిపోతుంది.

వృషభరాశి : అన్నింటా జయం,అనుకూలం, ధనలాభం, కార్యజయం,వ్యాపార లాభాలు, ఆరోగ్యం, కుటుంబ సంతోషం.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు, దేవాలయ దర్శనం చేయండి.

మిథునరాశి : అనుకూల ఫలితాలు, అనవసర ఖర్చులు, స్త్రీ మూలకంగా ధనలాభం, ఆరోగ్యం, పనులు పూర్తి, విందులు. కుటుంబ సఖ్యత.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేయండి.

May 16th Thursday daily Horoscope

కర్కాటకరాశి : శారీరక శ్రమ, అధికారులతో మైత్రి, కార్యజయం, ప్రయాణాలు కలిసి వస్తాయి, అరోగ్యం, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర దీపారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

సింహరాశి : మిశ్రమ ఫలితాలు, బంధుమిత్రుల రాక, పనుల్లో జాప్యం, ధనవృద్ధి, స్నేహితులతో నష్టం, ప్రయాణ సూచన.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర దీపారాధన మంచి చేస్తుంది.

కన్యారాశి : కార్యజయం, కుటుంబ సఖ్యత, మనోత్సాహం, అధికలాభం, సంతానంతో పేరు, ఆరోగ్యం, ఆర్థికంగా బాగుంటుంది.
పరిహారాలు: దేవాలయ దర్శనం, ప్రదక్షణలు చేయండి.

తులారాశి : అన్నింటా జయం, ఆకస్మిక ధనలాభం, అన్ని రంగాల వారికి యోగం, పనులు పూర్తి, ఆర్థికంగా బాగుంటుంది, ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేసుకోండి.

వృశ్చికరాశి : బంధువుల రాక, మిత్రులతో వివాదాలు, అనారోగ్యం, ప్రయాణాలు తప్పనిసరి అయితే తప్ప వెళ్లకండి, ఆర్థిక ఇబ్బంది.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర దీపారాధన,ప్రదక్షణలు చేయండి.

ధనస్సురాశి : ధనవృద్ధి, బంధువులు రాక, పనులు పూర్తి, ఆరోగ్యం, ప్రయాణ సూచన, కుటుంబ సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.

మకరరాశి : ముఖ్యమన పనులు వాయిదా, పెద్దలతో పరిచయం, వాహనాలతో జాగ్రత్త, అధికశ్రమ, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: నవగ్రహాలకు దీపారాధన చేయండి,ప్రదక్షణలు చేయండి.

కుంభరాశి : ప్రతికూలం, కార్యవ్యతిరేకం, బాకీలు వసూలు రావు, కుటుంబంలో అపార్థాలు, ఆనారోగ్య సూచన.
పరిహారాలు: నవగ్రహాల దగ్గర దీపారాధన, ప్రదక్షణలు చేయండి.

మీనరాశి : ప్రతికూలం, బంధు అనారోగ్యం, అధికారులతో ఇబ్బందులు, ఆరోగ్యం, ప్రయాణాల వల్ల ఇబ్బందులు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామి అర్చన, దేవాలయ దర్శనం చేయండి.

కేశవ