భారత్, చైనాల మధ్య గత కొద్ది రోజులుగా తీవ్రమైన సరిహద్దు గొడవలు జరుగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే లడఖ్‌లో ఇరు దేశాల సైనికులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆ దాడిలో 20 మంది భారత జవాన్లు చనిపోయారు. అయితే ప్రస్తుతానికి అంతా సద్దుమణిగినట్లే కనిపిస్తోంది. ఇరు దేశాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు శాంతి చర్చలు జరుపుతున్నారు. కానీ ఏ క్షణంలో అయినా యుద్ధం రావచ్చుననే సంకేతాలు ఉండడంతో ఇరు దేశాలు సరిహద్దుల వద్ద భారీగా బలగాలను మోహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్, చైనాలు గనక ఒక వేళ యుద్ధం చేస్తే.. ఏయే దేశాల బలం ఎంతో, ఎవరి దగ్గర ఎక్కువ సైన్యం, ఆయుధాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
మ్యాన్ పవర్…
భారత్ వద్ద మొత్తం 622, 480, 340 మ్యాన్ పవర్ ఉంది. చైనా 752, 855, 402 మ్యాన్ పవర్‌ను కలిగి ఉంది. ఇండియా వద్ద మొత్తం 1,444,000 మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. అదే చైనా వద్ద 2,183,000 మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. కానీ ఇండియా వద్ద బెంచ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది. మొత్తం 2,100,000 మంది ఉండగా, చైనా వద్ద 510,000 మంది మాత్రమే ఉన్నారు.
ఎయిర్ పవర్…
ఇండియా వద్ద 538 కోంబ్యాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 700 హెలికాప్టర్లు మొత్తం కలిపి 2,123 ఉన్నాయి. చైనా వద్ద ఇవన్నీ కలిపి 3,210 ఉంటాయి.
ల్యాండ్ రీసోర్సెస్…
చైనా వద్ద 33వేల ఆర్మర్డ్ వాహనాలు, 3500 కోంబ్యాట్ ట్యాంక్‌లు, 3800 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3600 ఫీల్డ్ ఆర్టిలరీ, 2650 రాకెట్ ప్రొజెక్టర్లు ఉన్నాయి. భారత్ వద్ద 8,686 ఆర్మర్డ్ వాహనాలు, 4,292 కోంబ్యాట్ ట్యాంకులు, 235 సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 4060 ఫీల్డ్ ఆర్టిలరీ, 266 రాకెట్ ప్రాజెక్టర్లు ఉన్నాయి.
నేవీ బలం…
భారత్ వద్ద 1 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, 16 సబ్ మెరైన్లు, 10 డెస్ట్రాయర్లు, 13 ఫ్రిగేట్లు, 19 కోర్వెట్స్, 3 క్రాఫ్ట్‌లు, 139 కోస్టల్ పెట్రోల్ వెస్సల్స్ మొత్తం కలిపి 285 ఉన్నాయి. అదే చైనా వద్ద ఇవన్నీ కలిపి 777 ఉన్నాయి. వాటిలో 2 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు, 74 సబ్ మెరైన్లు, 36 డెస్ట్రాయర్లు, 52 ఫ్రిగేట్లు, 50 కోర్వెట్స్, 29 క్రాఫ్ట్‌లు, 220 పెట్రోల్ వెస్సల్స్ ఉన్నాయి.