అక్రమసంబంధాలకు అసలు కారణాలు ఏంటి..? కేవలం అదొక్కటే కాదు

-

ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పడు మరో వ్యక్తికి ఎందుకు అట్రాక్ట్‌ అవుతారు. ఒకేసారి ఒకేలాంటి ఫీలింగ్‌ ఇద్దరిపై ఎందుకు కలుగుతుంది..? అక్రమసంబంధాలకు కారణాలు ఏంటి..? భార్య ఎంత ప్రేమ చూపించినా ఎందుకు భర్తలు ఇతర మహిళలతో సన్నిహితంగా ఉంటారు. తన భర్త వేరే వాళ్లకు కూడా తనతోపాటు సమానంగా చూస్తున్నాడు, వారిని కూడా అంతే ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఏ భార్య తట్టుకోలేదు. ఇదే భర్త విషయంలోనూ జరుగుతుంది. ఇది తెలిసి కూడా ఎందుకు కొందరు అక్రమసంబంధాలు పెట్టుకుంటున్నారు. కేవలం సెక్స్‌ కోసం అయితే అది అప్పటితో అయిపోవాలి. కానీ పదే పదే ఎందుకు..?

విసుగువస్తే మొదటికే మోసం..

పెళ్లైయిన కొంత కాలం తర్వాత చాలా మంది జంటలు రిలేషన్ షిప్లో బోర్‌గా ఫీల్ అవుతారు. మీరు ఈ విసుగును సీరియస్‌గా తీసుకోకుంటే, అది మీ సంబంధానికి పెద్ద నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే జంటలో ఒకరు విసుగు చెందినప్పుడు, కొత్త సంబంధంలో థ్రిల్ కోసం చూస్తారు. విసుగు అనేది వ్యక్తులు బయటి సంబంధాలు, ప్రేమను కోరుకునేలా చేస్తుందట. ఆనందాన్ని పొందడానికి వారు వివాహేతర సంబంధాలను వెతుక్కుంటారు. ప్రస్తుత సంబంధంలో లేనిది ఏదో.. తిరిగి పొందేందుకు ఇది ఒక అవకాశంగా మారుతుంది.

శృంగారంలో సంతృప్తి లేనప్పుడు..

ఇది అన్నింటికంటే చాలా ముఖ్యమైనది. ప్రేమ అంటే సెక్స్‌ కూడా..మీ ప్రేమ మరింత దృడంగా మారాలంటే.. సెక్స్‌లో చెలరేగిపోవాలి. మీకు నచ్చినట్లుగా అడిగి మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొనాలి. ఇక్కడ తేడా వస్తే దాని ప్రభావం మీ వైవాహిక జీవితంపై గట్టిగా పడుతుంది. చాలా మంది మగవారు వివాహేతర సంబంధం పెట్టుకోవాడని భార్య అన్ని విధాలా తనను శృంగారంలో సంతృప్తి పరచకపోవడమే అని ఒక స్టడీలో తేలింది. కాబట్టి శృంగారం అనేది మీ బంధంలో చాలా కీ రోల్‌ ప్లే చేస్తుంది. బ్లో జాబ్‌ చేయడం చాలామంది ఆడవారికి నచ్చదు. కానీ మీ భర్తపై ప్రేమతో చేస్తేనే అది వారిని స్వర్గపు అంచుల వరకూ తీసుకెళ్తుంది. ఈ విషయంలో ఒకరికొకరు సంతృప్తిగా ఉంటే మీ బంధం చాలా స్ట్రాంగ్‌ అవుతుంది.

భాగస్వామి చేసిన తప్పను తట్టుకోలేక..

భాగస్వామిని మోసం చేయడం అనేది వారు ఏదైనా చేసిన తప్పుకు ప్రతీకారంగా భావించవచ్చు. తమ భాగస్వామి ద్రోహం చేసినా, పెద్దగా పట్టించుకోకపోయినా ప్రతీకారం తీర్చుకునేందుకు ఇలా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు. అయితే భాగస్వామికి ఆ విషయం తెలిసినా.. తెలియకపోయినా.. ఇలా చేస్తేనే.. వారికి సరైన బుద్ధి అనే భ్రమలో ఉంటారు. దీని వెనక ఉద్దేశ్యం ఏమిటంటే, ఎదుటి వ్యక్తి ఎంత బాధపెట్టారో అంతే బాధపెట్టి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం.

ఎమోషనల్‌ కనక్షన్‌ లేకపోవడం..

ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడంతో తమ భాగస్వామి డిస్‌కనెక్ట్ అయినట్లుగా కొందరు భావిస్తారు. భాగస్వామి నిర్లక్ష్యం చేస్తే, దూరంగా ఉన్నట్లు భావించినప్పుడు ఇతరులతో అక్రమ సంబంధాన్ని పెట్టుకునే అవకాశం ఉంది. అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి కాస్త ఎమోషన్స్ చూపించినా.. కరిగిపోతారు. అలాంటి సందర్భాలలో, వారు కోరుకునే భావోద్వేగ సంబంధమే వారి భాగస్వామిని మోసం చేసేలా చేస్తుంది. అలా వారు వివాహేతర సంబంధాల వైపు అడుగులు వేస్తారు.

సంతోషం దొరకనప్పుడు..

ఎవరైనా ఒక సంబంధంలో సంతోషంగా లేదా అసంతృప్తిగా ఉన్నప్పుడు ఆ బంధాన్ని అక్కడితో ముగించలేరు. నేరుగా వెళ్లి.. నీతో నాకు కుదరదు అని చెబితే ఎవరూ వినరు. దీంతో మోసం చేయడం ద్వారా సులభంగా దూరం అవ్వచ్చు అనే ఆలోచనల్లో ఉంటారు. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటే భాగస్వామి విడిపోతారని కొందరు ఇలా చేస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news