నిద్రపోతున్నప్పుడు మనం ఎన్నో రకాల కలలు కంటుంటాం. కలలు ఏదో యాదృచ్ఛికంగా వస్తాయి అని అనుకుంటాం. కానీ కలలు భవిష్యత్తుకు సంకేతాలు. మనమే చనిపోయినట్లు ఒకసారి కలలు కంటుంటాం. ఇలాంటి కలలు వస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఇలాంటి కలలు దేనికి సంకేతం. పండితులు ఏం చెప్తున్నారో..? తెలుసుకుందాం.
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మీకు కలలో చనిపోయిన వ్యక్తి కనిపిస్తే, ఆ వ్యక్తి మీకు చాలా ప్రత్యేకమని ఆ వ్యక్తితో మీకు చాలా అనుబంధం ఉందని అర్థం. కానీ ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి గురించి కలలుగన్నట్లయితే.. అది మంచిది కాదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని మళ్లీ మళ్లీ చూడటం కొన్ని పెద్ద ఇబ్బందులను సూచిస్తుంది.
కలలో ఒకరి మరణాన్ని చూడటం మీకు మంచి సంకేతం. మీరు చాలా కాలం జీవించబోతున్నారని అర్థం. మీరు ఏదైనా సమస్యతో పోరాడుతుంటే, మీరు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు. దీనితో పాటు.. మీ జీవితంలో కొన్ని పెద్ద మార్పులు జరగబోతున్నాయని అర్థం. మీ కలలో ఏదైనా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి మరణించినట్లు కనిపిస్తే.. అది మీకు హానికరం కాదు. ఎందుకంటే అలాంటి వ్యక్తిని కలలో చూడటం అంటే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆరోగ్యం త్వరలో మెరుగుపడుతుందని అర్థం.
చనిపోయిన తండ్రిని కలలో చూడటం సానుకూల సంకేతం. మరణించిన మీ తండ్రితో మాట్లాడటం లేదా మీ తండ్రిని కలలో చూడటం శుభప్రదం. ఈ కల అంటే మీ జీవితంలో ఆనందం వస్తుందని అర్థం.
చనిపోయిన వారు మీ పాదాల వద్ద నిలబడితే అది మంచికి సూచనగా చెబుతున్నారు. ఇలా కనిపిస్తే రానున్న రోజుల్లో జీవితంలో కొన్ని సంక్షోభ పరిస్థితులు వస్తాయని పండితులు చెబుతున్నారు.
మీ పూర్వీకులతో కలిసి భోజనం చేస్తే అది మంచి కలగా భావించాలని కలల శాస్త్రం చెబుతోంది. ఈ కల వస్తే మీకు మంచి జరగనుందని అర్థం.
చనిపోయిన వ్యక్తి ఒకవేళ కలలో నవ్వుతున్నట్లు కనిపిస్తే చనిపోయిన వ్యక్తి సంతోషంగా ఉన్నాడని అర్థం. ఇలాంటి కలలు మీకు వస్తే మంచి జరగనుందని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.