కలలో బొద్దింకలు వచ్చాయా..మంచిదే కానీ..ఇలా వస్తే ప్రమాదమట..!

బొద్దింగను చూస్తే..అమ్మాయిలకు ఎక్కడలేని భయం వేస్తుంది కదా..అమ్మాయిలనే కాదు..కొంతమంది అబ్బాయిలు కూడా బొద్దింకలకు భయపడతారు. ఆ భయంతోనే వాటినే లేపయడానికి..స్ప్రేలు వాడతారు..మీకు తెలుసా..అణుబాంబు పడినా..బొద్దింకలు బతికి ఉండగలవు. అంత ప్రత్యేకత ఉంది వాటిల్లో..సరే ఇప్పుడు ఆ విషయం కాదు..ఒకవేళ బొద్దింక కలలోకి వస్తే..ఎలా ఉంటుంది. దాని సంకేతం ఏంటో ఈరోజు తెలుసుకుందాం.

cockroachs

బొద్దింక లేదా బొద్దింకలు కనిపిస్తే అది మీకు శుభ సంకేతం అంటున్నారు మనసిక నిపుణులు. బొద్దింకలు ఎలాంటి వాతావరణంలోనైనా బతకగలవు. అంటే వాటి అర్థం… సుదీర్ఘకాలం ఉండగలవు లేదా… పట్టుదల ఉన్నవి అని అర్థం. అలాంటిది.. కలలో బొద్దింక కనిపిస్తే మీరు ఏదో అంశంలో పట్టుదలతో విజయం సాధిస్తారని అర్థమట. మీరు ప్రయత్నాన్ని వదిలేసుకుందాం అనుకునే సమయంలో ఒకవేళ మీ కలలో బొద్దింకలు కనిపించాయంటే మీ మనసులో పట్టుదలను పెంచుతాయట. విజయం సాధిస్తారు కానీ అది అంత ఈజీగా రాదు. ఎన్నో బాధ్యతలు పూర్తిచేశాకే..విజయం మీకు దక్కుతుంది.

ఫ్రెండ్స్ హెల్ప్ అడిగినప్పుడు మీ వల్ల కాకనో మరే కారణం చేతనైనా మీరు సాయం చేయలేకపోయినప్పుడు..ముఖ్యంగా ఇంటికి సంబంధించి..దోస్తులు రూమ్అడిగినప్పుడో లాంటి సందర్భాల్లో మీరు ఇవ్వలేకపోతే..వాళ్లు మీపై కాస్త అసహనంగా ఉండొచ్చు. మీ మనసులో కూడా.. వాళ్లకు సాయం చెయ్యలేకపోయానే బాధ ఉంటుంది. అలాంటి సందర్భంలో కూడా మీకు బొద్దింకలు కలలో కనిపిస్తాయట.
ఇంట్లో అపరిశుభ్ర వాతావరణం ఉన్నవారికి కలలో బొద్దింకలు కనిపిస్తే… త్వరలో అనారోగ్యం రాబోతోందని అర్థం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఇంటిని క్లీన్ చేసుకోవాలి.
ఒక్కోసారి ఏదో విషయంపై మీరు ఆందోళనతో ఉన్నప్పుడు, భయపడుతున్నప్పుడు కూడా మీకు కలలో బొద్దింక లేదా బొద్దింకలు కనిపిస్తాయి. అప్పుడు ఆ విషయం ఏంటనేది విశ్లేషించుకోని..పరిష్కరించుకోవాలి.
భవిష్యత్తులో మీరు ఏదైనా గుడ్ న్యూస్ వినే పరిస్థితి ఉంటే కూడా కలలోకి బొద్దింకలు వస్తాయి. భవిష్యత్తులో మీకు మనసుకి నచ్చేది ఏదో జరుగుతుంది. లేదంటే… మీకు సర్‌ప్రైజ్ కలిగించేది ఏదో జరుగుతుందని కూడా అర్థమట.
మీ కలలో బోలెడు బొద్దింకలు కనిపిస్తూ… అవి మీ శరీరం అంతటా పాకుతూ పరుగెడుతూ ఉంటే అది మంచి శకునం కాదట. మీరు మీ టార్గెట్లను చేరుకోవడానికీ, అనుకున్నది పూర్తి చేయడానికీ సరిపడా సన్నద్ధతతో లేరని అర్థం. అంటే మీ శక్తి సరిపోదన్నమాట. మీకు శత్రువులు ఉంటే వారితో మీకు వివాదం నడుస్తుంటే… అలాంటప్పుడు ఇలా కలలో కనిపిస్తే… మీరు ఆ శత్రువులతో నెగ్గలేరని అర్థమట.
కలలో బొద్దింకలు కనిపిస్తే… కంగారు, ఆందోళన చెండాల్సిన పనిలేదు. భవిష్యత్తులో మంచే జరుగుతుంది. అయితే కాస్తంత శ్రమపడాల్సి ఉంటుంది. పట్టుదలతో పనులు పూర్తిచేయాల్సి ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
-Triveni Buskarowthu