మే డే అంటే ఏమిటి..? ఎందుకు జరుపుకోవాలి..?

యూరప్‌ లో ప్రభుత్వ, ధనిక వ్యాపారుల దోపిడీలని అడ్డుకోవాలని 1900 నుంచి 1920 వరకూ కూడా అక్కడ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే1న నిరసన చేస్తూ వుండే వారు. అయితే ఫస్ట్ వరల్డ్ వార్ సమయం లో మే డే నాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టేవారు. ఇది ఇలా ఉంటే ఆ తరువాత మే 1ని నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు. అలానే హిట్లర్ పరిపాలన లో ఆ రోజుని జాతీయ కార్మికుల దినోత్సవంగా జరిపేవారు.

ఇటలీలో ముసోల్ని, స్పెయిన్‌ లో జనరల్ ఫ్రాంకోలు మే డే పైన అనేక ఆంక్షలను విధించారు. ఆ తరువాత సెకండ్ వరల్డ్ వార్ అయ్యాక యూరొపియన్ దేశాల్లో మే 1 ని హాలిడే గా మార్చారు. ఎన్నో దేశాల్లో కార్మికుల సంక్షేమ పథకాలు మే ఒకటిన అమలు లోకి వచ్చాయి.

దీనితో సంక్షేమ పథకాల అమలు మరియు నిరసనలు రెండు కూడా మే ఒకటిన చెయ్యడం మొదలు అయ్యింది. ఎన్నో రకాల కార్మిక ఉద్యమాలూ మే డే నాడే సాధించగలిగాయి.

మే డేని సెలవు దినంగా పాటించడం జరిగింది. అదే విధంగా ట్రేడ్ యూనియన్లు ఇదే రోజున ధర్నాల తో పాటు ర్యాలీలు, ఇతర ప్రదర్శనలనూ చేస్తారు. ఇలా మే డే వచ్చింది.

శ్రామికులందరికీ మే డే శుభాకాంక్షలు…