18 ఏళ్ళు పైబడిన అందరికీ వ్యాక్సిన్ అనే కేంద్రం నిర్ణయానికి మొదటి రోజే అడ్డంకులు ఏర్ప్దడ్డాయి. ఈరోజు నుండి 18 నుంచి 44 ఏండ్లవారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా, వ్యాక్సిన్ల కొరత కారణంగా అసలు మొత్తం మీద వ్యాక్సిన్ ప్రక్రియ నిలిచిపోతుంది. కేంద్రం నుంచి సరిపడా డోసులు రాష్ట్రానికి రాకపోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు, రేపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ శ్రీనివాస్ ప్రకటించారు.
ఇప్పటికే వ్యాక్సిన్లు అందకపోవడం వల్ల మొదటి డోసు తీసుకున్న అనేక మంది రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. కొవాగ్జిన్ తొలి డోసు పూర్తిగా దొరకడం లేదు, మరోపక్క కోవిషీల్డ్ మొదటి డోసు తీసుకొని సెకండ్ డోసు కోసం ఎదురు చూస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నారు. కేంద్రం నుంచి వ్యాక్సిన్లు వస్తే గాని రాష్ట్రంలో మళ్లీ వ్యాక్సినేషన్ మొదలయ్యే పరిస్థితి లేదని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.