హనీమూన్ అయిపోయాక జంటల మధ్యం జీవితం రొమాంటిక్ గా ఉండాలంటే..

-

పెళ్ళయ్యాక హనీమూన్ ప్లాన్ చేసుకుని వారం రోజుల పాటు సంతోషంగా గడిపి ఇంటికి చేరుకున్నాక సాధారణ జీవితంలో పడిపోయి రొమాంటిక్ జీవితానికి దూరమవుతున్నారా? హనీమూన్ లో ఉన్న రొమాన్స్ సాధారణ జీవితంలో కొరవడిందా? ఏడురోజులకే పరిమితమైన రొమాన్స్, ఏడు కాలాల పాటు ఉండాలంతే ఏం చేయాలో అర్థం కావట్లేదా? ఐతే ఇది మీకోసమే.

హనీమూణ్ తర్వాత బాగున్న జీవితమే హ్యాపీగా సాగుతుంది. లేదంటే గతుకు రోడ్డుమీద బండి వెళ్ళడానికి కష్టపడినట్టు అవుతుంది పరిస్థితి. ఇలా కాకుండా ఉండడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కమ్యూనికేషన్

ప్రేమను తెలియజేసే పద్దతులు తెలుసుకోండి. సాధారణ జీవితంలో ఆఫీసులో పని చేస్తున్నా కూడా అప్పుడప్పుడు మెసేజ్ చేయడం మర్చిపోవద్దు. ఇంటికి వస్తూ గుర్తుండిపోయేలా ఏదో ఒకటి తీసుకురండి. బయట కూడా నువ్వు నాకు గుర్తున్నావన్న ఫీలింగ్ అవతలి వారికి కలగాలి. అది బంధాన్ని పటిష్టంగా ఉంచుతుంది.

స్పర్శ

కొత్తగా పెళ్ళయిన జంటలను వదిలేస్తే, పిల్లలు పుట్టాక స్పర్శ ప్రాధాన్యం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ అది చాలా ఇంపార్టెంట్. కేవలం పిల్లలు పుట్టినంత మాత్రాన మీరు అంతకుముందులా ఉండకూడదన్న నియమాలేవీ లేవని గుర్తుంచుకోవాలి.

సహాయం

ఒకరి పనుల్లో ఒకరు సహాయం చేసుకోవడం జీవితాన్ని రొమాంటిక్ గా మారుస్తుంది. వంటలో హెల్ప్ చేయడం దీనిలో ప్రముఖంగా ఉంటుంది. కిచెన్లో ఇద్దరూ కలిసి వంట వండుకుని భోజనం ఆరగిస్తుంటే వచ్చే హ్యాపీనెస్, హాల్లో కూర్చున్న మీ దగ్గరికే అన్నం ప్లేటు తీసుకొస్తే రాదు. మగవాళ్ళు ఇది గుర్తుంచుకోవాలి.

అప్పుడప్పుడు షికార్లు

పిల్లలు పెద్దయ్యాక కూడా అప్పుడప్పుడు షికార్లు వెళ్ళివస్తూ ఉండాలి. అంతా పిల్లల కోసమే చేస్తాం అనే మాటలు మాట్లాడవద్దు. ప్రస్తుతం పిల్లలందరూ తల్లిదండ్రులకి దూరంగానే ఉంటున్నారు. కేవలం ఫోన్లో మాత్రమే హాయ్ చెబుతున్నారు. ఎవరి జీవితం వారిది. అందుకే మీకు సంతోషాన్నిచ్చి, మీ బంధాల్ని నిలబెట్టే వాటిని ఆచరించడంలో ఎలాంటి తప్పులేదు.

Read more RELATED
Recommended to you

Latest news