ఇప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డులు లేని మనిషంటూ ఎవరూ ఉండరు. ఏం చేస్తాం అన్నింటికి వీటిని లింక్ చేసేశారు. సిమ్ కార్డ్ నుంచి పాస్ పోర్టు వరకూ ఈ కార్డులే అడుగుతారు. వీటి అవసరం ఏంతుందో మనకు బాగా తెలుసు. అయితే ఒక వ్యక్తి చనిపోయాక ఆ పాన్ కార్డ్, ఆధార్ కార్డులను ఏం చేయాలో మీకు తెలుసా..ఇప్పుడు చూద్దాం.
మరణించిన వారి కార్డులను ఎన్ని రోజులని భద్రపరచాలనే సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. అయితే మరణించిన వ్యక్తి ఐటీ రిటర్న్స్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు పాన్‌కార్డును జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఐటీ రిటర్న్స్‌లోని నగదు బ్యాంకు ఖాతాలో జమ అయ్యేంత వరకు పాన్‌కార్డు యాక్టివ్‌గానే ఉండాలి. ఉద్యోగి డిపార్టుమెంట్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు మనుగడలో ఉండాలి. ఇవన్నీ పూర్తయ్యాక ఇక ఆ అకౌంట్‌ను క్లోజ్ చేయవచ్చు.
పాన్‌కార్డును క్లోజ్ చేయటం ఎలా?
ఫస్ట్ ఆదాయపు శాఖకు అప్లికేషన్ ఇవ్వాలి.
ఇందులో వారి పూర్తి వివరాలను పొందపరచాలి.
వ్యక్తి పేరు పాన్‌కార్డు నంబర్ మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
వీటన్నింటిని జత చేసి ఐటీ శాఖకు అప్లికేషన్ ఇవ్వాలి.
ఆ తర్వాత తదుపరి ప్రక్రియ ప్రారంభమవుతుంది.
అనంతరం పాన్‌కార్డు క్లోజ్ అవుతుంది.
ఈ ప్రక్రియ ఎవరు పడితే వాళ్లు చేయకూడదట..
పాన్‌కార్డు క్లోజింగ్‌కి సంబంధించిన దరఖాస్తుని మరణించిన వారి చట్టపరమైన వారసులే సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జరిగే ప్రక్రియలో కూడా వారసులే కీలకం. ఇతరులు చేయడానికి వీలులేదు. మరణించిన వారి పాన్ కార్డుని వారి వారసుల అభ్యర్థన మేరకు వేరే వారికి బదిలీ చేయోచ్చు.
ఒకవేళ భవిష్యత్ లో ఆ పాన్ కార్డుతో అవసరం ఉంటుందనుకుంటే క్లోజ్ చేయకూడదు. ఆదాయపు శాఖకు చెల్లించాల్సిన పనికూడా లేదు. అయితే ముందుముందు ఎలాంటి ఉపయోగం లేదని భావిస్తే మాత్రం క్లోజ్ చేయడం ఉత్తమం అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ అది దుర్వినియోగం జరిగితే లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
పాన్ కార్డులా ఆధార్ కార్డును క్లోజ్ చేసే పరిస్థితి లేదు. ఒకసారి ఒక నెంబర్ జారీ అయితే ఆ వ్యక్తి బతికున్నా లేదా మరణించినా అతనికే ఆ నంబర్ వర్తిస్తుంది. ఆధార్ కార్డును క్లోజ్ చేసే అవకాశం లేదు కాబట్టి దుర్వినియోగం కాకుండా జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి. ఆ జిరాక్సులు కానీ, ఒరిజనల్ కార్డు ఎక్కడంటే అక్కడ పెడేస్తే…దుర్వినియోగం అయ్యో ప్రమాదం ఎంతైనా లేకపోలేదు.