ప్రేమ నిలబడాలంటే చేయాల్సినవి, పెళ్ళి నిలబడాలంటే చేయకూడనివి..

ప్రేమ, పెళ్ళి.. రెండూ బంధాలే. కానీ రెండింటికీ రెండు వేర్వేరు నిర్వచనాలు ఉన్నాయి. ప్రేమలో ఉన్నప్పుడు కనిపించే లోకం పెళ్ళయ్యాక కనిపించదు. అదే ఇద్దరు మనుషులు ప్రేమలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. పెళ్ళయ్యాక ఒకలా ఉంటారు. దానికి చాలా కారణాలుంటాయి. ఐతే ప్రేమ నిలబడితేనే పెళ్ళి దాకా వస్తుంది. పెళ్ళి నిలబడితే జీవితం హ్యాపీగా ఉంటుంది. అందుకే ముందుగా, ప్రేమ నిలబడాలి. ఆ తర్వాత పెళ్ళి నిలబెట్టుకోవాలి.

ముందుగా ప్రేమ నిలబడాలంటే

అనవసర అబద్ధాలు చెప్పవద్చు. మీరు చేయని పనులని కూడా మెప్పుకోసమని చెప్పి మీరే చేసారని అస్సలు చెప్పవద్దు. నిజాయితీగా ఉండండి. ప్రేమలో కనిపించే నిజాయితీ పెళ్ళి దాకా చేరుస్తుంది. మీరనుకున్న విషయాన్ని కరెక్టుగా చెప్పండి. ఆమెకి నప్పలేని విషయాలను సున్నితంగా చెప్పండి. బర్త్ డే లాంటి విషయాలను అస్సలు మరువద్దు. అప్పుడప్పుడు చిన్న చిన్న సర్ప్రైజులు ఇవ్వండి. మీతో ఉన్నప్పుడు జీవితం ఎంత సంతోషంగా ఉంటుందని వారికి తెలిసేలా చేయండి. వారి బాధల్లో పాలు పంచుకోండి. కొన్ని సార్లు బాధపడడానికి కావాల్సిన స్పేస్ ఇవ్వండి.

పెళ్ళి నిలబడాలంటే

ప్రేమలో ఉన్న క్యాలిక్యులేషన్స్ అన్నీ పెళ్ళిలో మారిపోతాయి. దానికి కారణం పెళ్ళితో రెండు కుటుంబాలు ఒకటి కావడమే. మీ భాగస్వామిని గుర్తించండి. చాలా మంది ఆడవాళ్ళు ఈ గుర్తింపు లేకనే ఇబ్బంది పడుతుంటారు. మీ భాగస్వామి కుటుంబంలోని వాళ్ళని తక్కువ చేసి మాట్లాడవద్దు. ముందుగా, మీ కుటుంబం గురించి అనవసర సంభాషణ మానేయాలి. నలుగురు మనుషులు కలిసి ఉన్నప్పుడు చిన్నపాటి గొడవలు కామన్. పిల్లల పెంపకం విషయంలో ఇద్దరూ సమాన బాధ్యత తీసుకోవాలి. పిల్లలు చేసే తప్పులకి తల్లులని బాధ్యులను చేయవద్దు.