దెయ్యం పడితే ఏం అవుతుంది..? వాటిని వదిలించుకోవడం ఎలా..?

-

ఈరోజుల్లో కూడా దెయ్యాలు పట్టడం, వాటిని వదిలించుకోవడం జరుగుతూనే ఉన్నాయి. కొందరు దెయ్యాలు లేవని కొట్టిపడేస్తుంటారు. అసలు దెయ్యం పట్టడం అంటే ఏంటి..? వదిలించడం ఏంటి..? దెయ్యం ఎలా పడుతుంది. ఇలాంటి ఇంట్రస్టింగ్‌ విషయాల గురించి మనం తెలుసుకుందాం.!

దెయ్యం పట్టడం అనేది ఓ భావన. ఇది జరిగినప్పుడు సదరు వ్యక్తి అసౌకర్యంగా ఉంటాడు. అతన్ని చెడు శక్తులు ఆవహిస్తాయి. డిస్టర్బ్ చేస్తాయి. దీన్నే ప్రేత బాధ అంటారు. గతంలో చేసిన తప్పుల వల్లే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని పండితులు అంటున్నారు. దెయ్యం పట్టినప్పుడు ఆ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తిస్తారు. అంటే తనను తాను కొట్టుకుంటూ, హింసించుకుంటూ ఉంటారు. తన కుటుంబ సభ్యులను, బంధువులను కూడా హింసిస్తారు. సన్నిహితులను గాయపరుస్తారు. ఏదేదో ఊహించుకుంటూ ఉంటారు. వింతవింతగా చూస్తారు. నెగెటివ్ అంశాలకు ఆకర్షితులవుతూ, హింసాత్మకంగా ప్రవర్తిస్తారు.

రోజూలా కాకుండా అసాధారణంగా ప్రవర్తిస్తారు. మీరు గమనించే ఉంటారు..దెయ్యం పట్టినవాళ్లు.. ఎంత సన్నగా ఉన్నా.. వారికి బలం వస్తుంది. ఎంతో కష్టమైన పనులను కూడా ఈజీగా చేసేస్తారు. అంటే ఇదివరకు ఎత్తలేని బరువులను కూడా ఇప్పుడు తేలిగ్గా ఎత్తేస్తారు. దెయ్యం పట్టిన వారు ఉన్నట్టుండి గట్టిగా అరుస్తారు. ఇతరుల కంట్రోల్‌లో అస్సలు ఉండరు. కంట్రోల్ చెయ్యడానికి ప్రయత్నిస్తే… మరింత కఠినంగా మారిపోతారు. గట్టిగా ఊపిరిపీల్చి వదులుతూ… ఆయాసపడుతూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు నోటి నుంచి శబ్దం కూడా వస్తుంది. అతిగా ఆకలి వేస్తుందనీ, దాహం వేస్తుందని చెబుతారు. రోజూ తినే కంటే ఎక్కువ తింటారు.

ఈ లక్షణాలు చూసినప్పుడు చుట్టుపక్కల వారికి భయం వేస్తుంది. అలా భయపడాల్సిన పని లేదనీ దెయ్యం అందరికీ పట్టదని పండితులు చెబుతున్నారు. దెయ్యాన్ని వదిలించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి అంటున్నారు.

దెయ్యం పట్టిన వ్యక్తి తాలూకు వారు శివుణ్ని పూచించాలి. 1100 సార్లు శివ మంత్రాన్ని జపించాలి. అలాగే ఒక నిమ్మకాయ, 21 లవంగాలు, 1 ఏక ముఖి రుద్రాక్షను ప్రతి సోమవారం శివుడికి సమర్పించాలి. దెయ్యం పట్టిన వ్యక్తికి రుద్రాక్ష మాల వేయాలి. కుటుంబ సభ్యులు తమ వారిని వదిలివేయడానికి చెడు శక్తులను వేడుకోవాలి. రిక్వెస్ట్ చెయ్యాలి.

ఆంజనేయ స్వామి, దుర్గామాతను పూజించాలి. దెయ్యం పట్టిన వ్యక్తి ఉండే గదిలో అగరబత్తి వెలిగించాలి. అలాగే గోడకు ఆంజనేయస్వామి, దుర్గామాత, పరమేశ్వరుడి ఫొటోలను వేలాడదియాలి. హనుమాన్ చాలీసా జపించాలి. నుదుటిపై హనుమంతుడి బొట్టు పెట్టుకోవాలి.

దెయ్యాలను ఎప్పుడూ తిట్టకూడదు. వాటితో కఠినంగా మాట్లాడకూడదు. అలా చేస్తే దెయ్యాలకు కోపం వచ్చి మరింత రెచ్చిపోతాయని పండితులు హెచ్చరిస్తున్నారు.

ఇంటి ముందు గేటు దగ్గర తెల్ల పూలు వచ్చే మొక్కను నాటాలి. ఇంటి ప్రతి మూలలో గంగాజలాన్ని చల్లాలి. 1 కొబ్బరికాయ, 1 గోరు, 100 గ్రాముల నల్ల నువ్వులు తీసుకొని ఓ నల్ల గుడ్డలో కట్టాలి. శనివారం నాడు వాటిని నదిలో వదిలేయాలి. ఇలా చేస్తే దెయ్యాల బాధ ఉండదని పండితులు. ఏది ఏమైనా.. పరిస్థితి మరీ దిగజారితే.. సొంత ప్రయత్నాలు కాకుండా..పండితులను సంప్రదించడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Exit mobile version