ఇది ఆటోనా లేక ఇల్లా.. ఈయ‌న ఐడియాకి మొక్కాల్సిందే..!

తమినాడు రాజధాని చెన్నైకి చెందిన అన్నాదురై గురించి వింటే అందరూ షాకవుతారు. ప్రస్తుతం అన్నాదురై సోషల్ మీడియాలో స్టార్ లా మారిపోయాడు. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే… అన్నాదురైకి చిన్ననాటి నుంచి ఎప్పటికైనా తాను పారిశ్రామిక వేత్తను కావాలని కోరిక ఉండేదట. కానీ ఆ కోరికను తీర్చుకునేందుకు తన వద్ద సరిపడా డబ్బు లేకపోవడంతో పెద్ద చదువులు చదువుకోలేక పోయాడు.

ఫలితంగా ఓ ఆటో కొనుక్కుని నడుపుకుంటూ స్థిరపడ్డాడు. కానీ డబ్బు లేకపోతే ఏంటి అతడికున్న తెలివితో ప్రస్తుతం దేశవ్యాప్తంగా తన పేరు మార్మోగిపోయేలా చేసుకున్నాడు. తన ఆటోనే ఓ ఇండస్ర్టీలా భావించి అతడు ఏర్పరిచిన సదుపాయాలు చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోయారు.

ఇలా కొంత మంది ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. తన ఆటోలో ఎక్కువ మంది ప్యాసింజర్లు ఎక్కేందుకు అన్నాదురై వినూత్నంగా ఆలోచించాడు. ఇలా ఆలోచించి ఆటోలో టీవీ, ప్రిడ్జి తదితరాలు ఏర్పాటు చేశాడు. ఇలా ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా తాము ఓ స్టార్ హోటల్లో ఉన్నట్లు భ్రమ కలిగేలా ఉన్న వసతులను చూసి ప్యాసింజర్లు ఎక్కువ మంది అన్నాదురై ఆటోను ఎక్కేందుకు ఆసక్తి కనబరిచారు. అంతే కాకుండా అన్నాదురైకి తొమ్మిది భారతీయ భాషలు తెలియడం కూడా ఓ విశేషం. ఇలా చెన్నైకి వచ్చిన అనేక ప్రాంతాల వారిని తమ సొంత భాషలో పలుకరిస్తూ… విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఇలా అన్నాదురై ఆటోకు తెగ క్రేజ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో కూడా అన్నాదురైకి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది. కొద్ది రోజుల్లోనే లక్షల మంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు.