50 వేల ఉద్యోగాలపై మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన

50 వేల ఉద్యోగాలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. ఇవాళ సిద్దిపేట పట్టణంలో దాశరథి ఉత్సవాలను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే దాశరథి స్ఫూర్తితో ఇవాళ తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా అభివృద్ధి చేసుకున్నామని పేర్కొన్నారు.

తెలంగాణలో నేడు పసిడి పంటలు పండుతున్నాయన్నారు. త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కెసిఆర్ నిర్ణయించారని.. దీనిపై అతి త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించారు. ఇక నుంచి ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 1 లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు. అవసరం మేరకు రాష్ట్రంలో 64 వేల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. టీఆరఎస్ సర్కార్ హయాంలోనే తెలంగాణ అభివృద్ది సాధ్యం అని పేర్కొన్నారు.