సోషల్ మీడియాలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ 5 ఇండియన్ క్రికెటర్స్ వీరే..!

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. దీనితో సెలబ్రిటీలు కూడా కనెక్ట్ అయి ఉంటున్నారు. అభిమానులతో అనేక విషయాలను సెలబ్రిటీలు పంచుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు క్రికెటర్లు కూడా యాక్టివ్ గా ఉంటారు. తమకు సంబంధించిన ఫోటోలను, అప్డేట్స్ ని ఇస్తూ ఉంటారు. దీంతో ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ ఫైవ్ క్రికెటర్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

5. సురేష్ రైనా (44.4 మిలియన్) :

మంది ఫాలోవర్స్ వున్నారు. సురేష్ రైనా గురించి పరిచయం చెయ్యక్కర్లేదు. సురేష్ రైనా అందరికీ తెలిసిన క్రికెటర్. ఈ మధ్య అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఎన్నో అద్భుతమైన రికార్డులను సాధించిన సురేష్ రైనా కి ట్విట్టర్లో 19.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో 18.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్బుక్ లో 6 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు.

4. రోహిత్ శర్మ (63.8 మిలియన్) :

రోహిత్ శర్మ ఆట తీరు ఎంతో అద్భుతంగా ఉంటుంది. హిట్ మ్యాన్ అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. 64 మిలియన్ల మంది సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో 22.7 మిలియన్ల మంది ఫాలోవర్స్ అవుతున్నారు. ఫేస్బుక్ లో 20 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్లో 20.1 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.

3. మహేంద్ర సింగ్ ధోనీ (72.9 మిలియన్) :

ఎంఎస్ ధోని కెప్టెన్ కూల్ గా ఎన్నో అద్భుతమైన మ్యాచ్లు ఆడాడు. చక్కటి కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు. మహేంద్రసింగ్ ధోని మంచి ఫినిషర్ గా కూడా పేరు పొందాడు. మహేంద్ర సింగ్ ధోనీకి 37.5 మిలియన్ల మంది ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్లో 27 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్లో 8.4 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు.

2. సచిన్ టెండూల్కర్ (106.9 మిలియన్):

బ్యాటింగ్ మాస్ట్రో సచిన్ టెండూల్కర్ ఆఖరి మ్యాచ్ 2013లో ఆడాడు. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన సంగతి తెలిసిందే. సచిన్ టెండూల్కర్ కి సోషల్ మీడియాలో 107 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో 33 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్బుక్లో 37 మంది మిలియన్ ఫాలోవర్స్ వున్నారు. ట్విట్టర్లో 36.9 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

1. విరాట్ కోహ్లీ (278.8 మిలియన్):

విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వారిలో విరాట్ కోహ్లీ టాప్ వన్ గా నిలిచారు. విరాట్ కోహ్లీకి 278.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో 183 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో 49 మిలియన్ల మంది ఫాలోవర్స్ వున్నారు. ట్విట్టర్లో 46.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version