వయనాడ్ లో పొలిటికల్ గేమ్ స్టాట్.. బిజేపీ ప్లాన్ అదేనా..?

-

కేరళలోని వయనాడ్ లో మరో పొలిటికల్ గేమ్ స్టాటవ్వబోతుంది.. రాహుల్ గాంధీ రాజీనామాతో ఇక్కడి నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చెయ్యబోతున్నారు.. కొంతకాలం క్రితం ప్రకృతి విలయంతో అతలాకుతమైన వయనాడులో కాంగ్రెస్ మరోసారి పైచేయి సాధిస్తుందా..లేక .. సీపీఐ, బిజేపీ పుంజుకుంటుందా అనేది హాట్ డిస్కర్షన్ గా మారింది.

మహారాష్ట, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ పడ్డ వయనాడ్ లోక్ సభ స్థానానికి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి.. నవంబర్ 13న వయనాడు పార్లమెంట్ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. పై రెండు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు నవంబర్ 23న వయనాడు ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుందని వెల్లడించింది..

గాంధీ కుటుంబానికి వయనాడ్ నియోజకవర్గం ప్రత్యేకమైనది.. ఎందుకంటే.. గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయనుండటమే. గత ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీతో పాటు.. వయనాడ్ లో రాహుల్ గాంధీ పోటీ చేశారు.. ఈ రెండు చోట్లా భారీ మెజార్టీతో గెలుపొందారు.. అయితే ఈ రెండు స్తానాల్లో ఏ సీటు వదులుకోవాలో అర్దం గాక గత కొద్దిరోజులుగా ఆయన సందిగ్దంలో ఉన్నారు.. పైనల్ గా వయనాడ్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేసి.. రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నారు..దీంతో వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీని బరిలోకి దింపుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది..

2019లో అమేథితో పాటు తొలిసారి వయనాడు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు.. అమేథి నుంచి ఓడిన రాహుల్‌ గాంధీ.. వయనాడులో మాత్రం భారీ మెజార్టీతో గెలిచారు. 2019-24 వరకు వయనాడు ఎంపీగానే కొనసాగారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా వయనాడ్ తో పాటు.. రాయ్‌బరేలీ తరపున పోటీ చేశారు.. ఈ సమయంలో సీపీఐ అభ్యర్ది అన్నీ రాజాగా పై 3 లక్షల 64 వేల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సురేంద్రన్‌కు లక్షా 41 వేల ఓట్లు వచ్చాయి..

కాంగ్రెస్ పార్టీ అభ్యర్దుల తరపున ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూవచ్చిన ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతూ ఉండటంతో.. వయనాడు ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొంది. హర్యానాలో గెలుపుతో జోష్ లో ఉన్న బిజేపీ.. ఈసారి బరిలోకి గట్టిగానే దిగబోతుంది.. మరోపక్క సీపీఐ కూడా ప్రియాంకను ఢీకొట్టబోతుంది.. అన్న స్థానాన్ని చెల్లి చేజిక్కించుంటుందో లేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news