అతడంటే పాములకు ఎందుకంత పగ..!?

-

వర్షాకాలంలో పాముల బెడద అధికంగా ఉంటుంది. ఇక గ్రామాలలో, అటవీ ప్రాంతాల్లో ఈ పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. పొలం గట్ల మీద, చెట్లు ఉన్న ప్రాంతాల కింద నక్కి ఉంటాయి. ఇక రాత్రిళ్లు ఆరుబయట నిద్రిస్తున్నప్పుడో పాములు కాటు వేస్తాయి. ఇక చాలామంది ఒక్కసారో రెండుసార్లో పాము కాటుకు గురవుతూనే ఉంటారు. అయితే ఓ వ్యక్తిని ఏకంగా 37 ఏళ్లుగా పాములు కాటేస్తూ వస్తున్నాయి. ఏదో పగబడినట్లు ప్రతి ఏటా క్రమం తప్పకుండా కాటు వేస్తున్నాయి. ఇప్పటి వరకు అతడు 37 సార్లు పాము కాటుకు గురైయ్యాడు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా ఇది నిజమేనండి. ఈ ఘటన ఏపీలో చోటు చేసుకుంది.

snake

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం పెద్దచల్లారగుంట పంచాయతీ కురవూరు గ్రామానికి చెందిన సుబ్రమణ్యం (42) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సుబ్రమణ్యానికి భార్య, కుమారుడు ఉన్నారు. ఐతే సుబ్రమణ్యంపై పాములు పగబట్టినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు అతడిని 37 సార్లు పాముటు కాటువేశాయి. సుబ్రమణ్యం ఐదో తరగతి చదువుతున్న సమయంలో మొదటిసారి పాము కాటు వేసింది. ఈ తర్వాత ప్రతి ఏటా ఎప్పుడో ఓసారి పాములు కాటేస్తూనే ఉన్నాయి. అలా 37 ఏళ్లలో 37 సార్లు సుబ్రమణ్యం పాము కాటుకు గురయ్యాడు. అది కూడా అతడి కుడి చేయి, కుడి కాలుపై మాత్రమే నాగుపాములు కాటేస్తున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

పాము కాటువేస్తే కనీసం 10 రోజులు విశ్రాంతి అవసరం. వైద్య చికిత్స కోసం రూ.10 వేల వరకు ఖర్చవుతోందని సుబ్రమణ్యం తెలిపారు. కూలీనాలీ చేసుకుని జీవనం సాగించంకునే తనకు ఇంత డబ్బు ఖర్చుచేయడం.. భారమవుతోందని వాపోతున్నారు. కాగా, ఇటీవలే మరోసారి అతడిని పాము కాటువేసింది. శంకరాయలపేటలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అనంతరం.. ప్రస్తుతం ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాము సంపాదించిన డబ్బుంతా పాముకాటు చికిత్సకే ఖర్చవుతుందోని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news