రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎప్పుడు ఎవ్వరూ ఏ పార్టీ మారుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తాజాగా  పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్  వచ్చి  బీఆర్ఎస్ లోకి ఆహ్వానించనున్నారు. పీవీ నరసింహారావు ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ లోనే కొనసాగాడు. కాంగ్రెస్ పార్టీ అవమానం ఎదురవుతుంటే.. ఏ కారణం చేత పార్టీలో కొనసాగాలని పొన్నాల ఈ నిర్ణయం తీసుకున్నారు.   రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు  చేశారు.  రేవంత్ రెడ్డి డబ్బు సంచులను అమ్ముకుంటున్నాడు. 

రేవంత్ రెడ్డి తొలుత బీజేపీ, ఆర్.ఎస్.ఎస్., టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు మారాడు.. ఆ తరువాత ఎన్ని పార్టీలు మారుతాడో ఎవ్వరికీ తెలియదు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ తీరును అంతా చీదరించుకుంటున్నారని.. చచ్చే ముందు పార్టీ మారడం ఏంటి అని కొందరూ అంటున్నారు. జనగామ టికెట్ పై కేసీఆర్ ను పొన్నాల కలిసిన తరువాత ఆయనే స్వయంగా చెబుతారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పొన్నాలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు మంత్రి కేటీఆర్. బీసీ నేతలను కాంగ్రెస్ పట్టించుకునే పరిస్థితి లేదని.. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారిని అణగదొక్కుతున్నారని విమర్శలు చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news