చ‌క్కిలిగింత‌ల‌ను మ‌నకు మ‌న‌మే పెట్టుకుంటే ఏమీ అనిపించ‌దు.. ఎందుకో తెలుసా..? 

-

మ‌న మెద‌డులో సెరిబెల‌మ్ అనే భాగం ఉంటుంది. ఇది మ‌న శ‌రీరంలో జ‌రిగే స్వీయ చ‌ర్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌సిగ‌డుతూ ఉంటుంది. అంటే మ‌న శ‌రీర భాగాల‌తో మ‌నం ఏం చేస్తున్నామో, ఏం చేయ‌బోతున్నామో అది ముందుగానే ప‌సిగ‌డుతుంద‌న్న‌మాట‌.

ఏ మ‌నిషికైనా చ‌క్కిలిగింత‌లు అనేవి కామ‌న్‌. ఇవి కొంద‌రికి ఉంటాయి, కొంద‌రికి ఉండ‌వు. అంతే తేడా.. కొంద‌రు ముట్టీ ముట్టుకోకుండానే గిలిగింత పెట్టిన ఫీలింగ్ వచ్చి అదిరిపోతారు.  కొంద‌రికి చ‌క్కిలి గింత‌లు ఎంత పెట్టినా ఉలుకు ప‌లుకు ఉండ‌దు. ఇక కొంద‌రైతే ఓ మోస్త‌రు చ‌క్కిలి గింత‌లు పెడితే తుళ్లి ప‌డ‌తారు. అయితే.. చ‌క్కిలి గింత‌లు అనేవి ఎదుటి మ‌నిషి పెడితేనే మ‌న‌కు వ‌స్తాయి. కానీ మ‌నకు మ‌నం చ‌క్కిలి గింత‌లు పెట్టుకుంటే తుళ్లింత‌లు రావు.. అవును, క‌రెక్టే క‌దా.. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుందో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం..!
మ‌న మెద‌డులో సెరిబెల‌మ్ అనే భాగం ఉంటుంది. ఇది మ‌న శ‌రీరంలో జ‌రిగే స్వీయ చ‌ర్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌సిగ‌డుతూ ఉంటుంది. అంటే మ‌న శ‌రీర భాగాల‌తో మ‌నం ఏం చేస్తున్నామో, ఏం చేయ‌బోతున్నామో అది ముందుగానే ప‌సిగ‌డుతుంద‌న్న‌మాట‌. ఈ క్ర‌మంలో మ‌న‌కు మ‌నం చ‌క్కిలిగింత‌లు పెట్టుకుంటే ఆ విష‌యం దానికి తెలుస్తుంది. అందువ‌ల్ల ప్ర‌తిచ‌ర్య ఉండ‌దు. దీంతో మ‌న‌కు మ‌నం చ‌క్కిలిగింత‌లు పెట్టుకుంటే ఏమీ అనిపించ‌దు. అదే ఇత‌రులు పెట్టే చ‌క్కిలిగింత‌ను మ‌నం ముందుగా ఊహించ‌లేం. అదే విష‌యం సెరిబెల‌మ్‌కు కూడా తెలియ‌దు. దీంతో ఎదుటి వారు మ‌న‌కు చ‌క్కిలి గింత పెట్ట‌గానే అందుకు సెరిబెల‌మ్ స్పందించి రియాక్ష‌న్ ఇస్తుంది. ఎదుటి వారు చ‌క్కిలిగింత పెట్ట‌గానే ఉలికిపాటు ఎదురై ప్ర‌తిచ‌ర్య వ‌స్తుంది. దీంతో ఎదుటి వారు చ‌క్కిలి గింత పెట్ట‌గానే మ‌న‌కు తుళ్లింత వ‌స్తుంది.
అయితే స్కిజోఫ్రేనియా అనే వ్యాధి ఉన్న‌వారు త‌మ‌కు తామే చ‌క్కిలి గింత పెట్టుకుంటే మాత్రం తుళ్లింత‌కు లోన‌వుతారు. ఎందుకంటే వారి మెద‌డు స్వీయ చ‌ర్య‌ల‌ను ప‌సిగ‌ట్ట‌లేదు. దీంతో చ‌క్కిలిగింత ఊహించ‌కుండా జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలో ప్ర‌తిచ‌ర్య వ‌స్తుంది. అప్పుడు తుళ్లింతకు లోన‌వుతారు. చ‌క్కిలిగింత‌లు ఉంటాయి. కానీ సాధార‌ణ వ్య‌క్తుల‌కు మాత్రం త‌మ‌కు తామే చ‌క్కిలిగింత‌లు పెట్టుకుంటే.. ఏమీ కాదు. ఇక షార్క్‌లు, చింపాంజీ, గొరిల్లా, ఒరాంగ్ ఊటాన్ త‌దిత‌ర ప‌లు జంతువుల‌కు కూడా చ‌క్కిలిగింత‌లు ఉంటాయ‌ట‌. వాటి మూతి పైభాగంలో నిమిరితే చ‌క్కిలిగింతలు వ‌స్తాయ‌ట‌.  ఏది ఏమైనా.. మ‌నం చ‌క్కిలిగింత‌ల ఫీలింగ్‌ను అనుభ‌వించ‌డం కంటే.. ఎదుటివారికి చ‌క్కిలి గింత‌ల‌ను పెడితే భ‌లే థ్రిల్లింగ్‌గా ఉంటుంది క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news