నువ్వే గెలిచావమ్మా… యూఏఈ చరిత్రలోనే తొలిసారి..!

-

యూఏఈ చరిత్రలోనే ఇది లిఖించదగ్గ అంశం. ఓ హిందూ, ముస్లిం దంపతులకు పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ ను జారీ చేశారు యూఏఈ అధికారులు. అదేంటి… ఓ బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ జారీ చేస్తే అది కూడా వార్తేనా? అని అంటారా? అవును.. అది వార్త కాదు.. అంత కంటే ఎక్కువ.

యూఏఈలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అక్కడ ఏ శిక్ష పడ్డా.. అది అమలవ్వాల్సిందే. అక్కడ ఏదైనా చట్టం చేస్తే దాన్ని ఫాలో అవ్వాల్సిందే. కాదూ కూడదు అంటూ కుదరదు. అందుకే.. గల్ఫ్ దేశాలకు పొట్ట చేత పట్టుకొని పోయే వారు కూడా అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా సమస్యల్లో చిక్కుకుంటే అంతే. జీవితమే పోతుంది. అలా ఉంటాయి అక్కడి చట్టాలు. చట్టాల విషయంలో మాత్రం వాళ్లు ఎవ్వరి మాటా వినరు.

First time in History UAE born child from india for hindu gets birth certificate

కానీ.. యూఏఈ అధికారులు ఈసారి ఎందుకో కరుణించారు. తమ చట్టాన్ని తామే మార్చేసుకున్నారు. తమకూ మానవత్వం ఉందని నిరూపించారు. అది కూడా ఓ పాప కోసం అవును.. ఓ పాపకు ఇవ్వవాల్సిన బర్త్ సర్టిఫికెట్ కోసమే.. ఈసారి గీత దాటారు.

అందుకే.. యూఏఈ చరిత్రలోనే ఇది లిఖించదగ్గ అంశం. ఓ హిందూ, ముస్లిం దంపతులకు పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ ను జారీ చేశారు యూఏఈ అధికారులు. అదేంటి… ఓ బిడ్డకు బర్త్ సర్టిఫికెట్ జారీ చేస్తే అది కూడా వార్తేనా? అని అంటారా? అవును.. అది వార్త కాదు.. అంత కంటే ఎక్కువ.

ఎందుకంటే.. అసలు.. యూఏఈ చట్టాల ప్రకారం… అక్కడ నివసించే విదేశీయుల్లో ముస్లిం పురుషుడు వేరే మతం మహిళను పెళ్లి చేసుకోవచ్చు. కానీ.. ముస్లిం మహిళ మాత్రం వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకోకూడదు. ముస్లిం మహిళ.. ముస్లిం వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి. అదే అక్కడి రూల్.

కానీ.. ఇండియాకు చెందిన కిరణ్ బాబు, సనమ్ సాబూ సిద్దిఖీ అనే దంపతులు హిందూ, ముస్లిం కుటుంబాలకు చెందిన వాళ్లు. ముస్లిం మహిళ సనమ్… హిందువు కిరణ్ బాబును కేరళలో పెళ్లి చేసుకున్న అనంతరం వాళ్లు షార్జాకు వెళ్లారు. అక్కడే సెటిల్ అయ్యారు. 2018 జులైలో వాళ్లకు అక్కడే కూతురు జన్మించింది. ఆమెకు అనామ్తా ఏస్ లిన్ కిరణ్ అని పేరు కూడా పెట్టుకున్నారు. అయితే.. అక్కడి చట్టాల ప్రకారం.. ఆ పాపకు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడానికి యూఏఈ అధికారులు నిరాకరించారు.

దీనిపై కోర్టును కూడా వాళ్లు సంప్రదించారు. అయినా ఫలితం లేదు. వాళ్లు ఇండియాకు తిరిగి వద్దామని ప్రయత్నించినా… తమ కూతురుకు బర్త్ సర్టిఫికెట్ లేకపోవడంతో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ రాలేదు. దీంతో వాళ్లు చేసేది లేక మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. అయితే.. ఈసారి కోర్టు వాళ్ల అభ్యర్థనను స్వీకరించింది. ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం ఆ బుజ్జిపాపాయికి బర్త్ సర్టిఫికెట్ ను అందించింది.

Read more RELATED
Recommended to you

Latest news