మీదగ్గర ఫోటో ఓటర్ స్లిప్ ఉన్నా ఓటేయలేరు. దాంతో మీరు ఓటేయలేరు. దానితో పాటు వేరే ఏదైనా ఐడెంటిటీ కార్డు ఉండాలి..
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందడి ప్రారంభం కానుంది. ఈనెల 11నే మొదటి దశ పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ రేపే జరగనుంది. దీంతో ప్రజలంతా ఓటేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే.. చాలామంది దగ్గర ఓటర్ ఐడీ కార్డు ఉండదు. దాన్ని ఎక్కడో పోగొట్టుకోవడం లేదా ఐటీ కార్డును తీసుకోకపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఓటర్ ఐడీ కార్డు ఉండాల్సిందే. వేరే ఏ ఐడీ కార్డులు పనిచేయవా? అనే డౌట్లు చాలామందికి వస్తుంటాయి. అయితే.. ఓటేయాలంటే ఓటర్ ఐడీ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరమే లేదు.
ఓటర్ ఐడీ కార్డు లేకపోయినా ఓటేయవచ్చు. కాకపోతే ఏదో ఒక ఐడెంటిటీ కార్డు ఉండాలి. మీ దగ్గర ఉన్న ఫోటో ఓటర్ స్లిప్ తో పాటు.. పాస్ పోర్టు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఐడీ కార్డు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు జారీ చేసే పాస్ బుక్స్(ఫోటో తప్పనిసరి), పాన్ కార్డ్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జారీ అయిన జాబ్ కార్డు, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, ఫోటో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక ఐడీ కార్డు, ఆధార్ కార్డుల్లో ఏదో ఒకటి ఉన్నా మీరు నిశ్చింతగా ఓటేయొచ్చు.