హైహీల్స్ అనేవి ఇప్పుడు ఆడవారి ఫ్యాషన్ ప్రపంచంలో భాగం అయిపోయాయి. కాస్త ఎత్తు తక్కువగా ఉన్నవారు వీటితో సమస్యను కవర్ చేసుకుంటున్నారు. అందరి చూపును ఆకట్టుకునేలా రకరకాల ఆకృతుల్లో హై హీల్స్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. అన్ని రకాల దుస్తులపై హీల్స్ స్టైల్‌గా, అందంగా కనిపిస్తాయి. కొంతమంది 4 నుంచి 6 అంగుళాల హైహీల్స్ కూడా ధరిస్తారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు..మనం చాలానే చూశాంకదా..హీల్స్ వేసుకుని జారిపడిన సన్నివేశాలు. హైహీల్స్ గురించి మరికొన్ని విషయాలను ఈరోజు తెలుసుకుందాం.
1. హైహీల్స్ పరిమాణంపై శ్రద్ధ వహించండి
సాధారణ పాదరక్షలను ధరించేటప్పుడు సైజు కాస్త అటుఇటూగా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ హైహీల్స్ విషయంలో ఇది జరుగదు. ఎలాంటి సర్దుబాట్లు చేయడం కుదరదు. అంతేకాదు ఇది చాలా ప్రమాదకరం కూడా. హైహీల్స్ ఖచ్చితమైన సైజులో ఉండాలి. చిన్న హైహీల్స్ మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. పెద్ద హైహీల్స్ వదులుగా ఉంటాయి. కాబట్టి బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉంటుంది. హీల్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ కావొద్దు. మీ సైజ్ కు సరిపోతనే వేసుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు.
2. ఇన్సోల్స్ ఉపయోగించండి
మీరు ఎటువంటి సమస్య లేకుండా ఎక్కువ కాలం హైహీల్స్ ధరించాలనుకుంటే ఇన్సోల్స్ ఉపయోగించవచ్చు. ఇవి సాధారణంగా సిలికాన్ లేదా ఫాబ్రిక్‌తో తయారు చేస్తారు. ఇవి మీ పాదాలను ముందుకు కదలకుండా ఆపుతాయి. నొప్పి, పొక్కులను తగ్గించడంలో ఇది సహాయపడతాయి.
3. సరైన ఆకృతిని ఎంచుకోవాలి
మార్కెట్‌లో మీరు అనేక రకాల హై హీల్స్‌ను చూస్తారు. అలా చూసినవి అన్నీ..మనకు సెట్ కావు..మీకు కంఫర్ట్ గా ఉండేవే మీరు వేసుకోవాలి. మొదటి సారి హైహీల్స్ వేసుకుంటున్నట్లయితే ఎత్తు, సైజ్ జాగ్రత్తగా ఎంచుకొని తీసుకుంటే మంచిది.
4.. ఎత్తు తక్కువుంటే బెస్ట్
మీరు హై హీల్స్ ధరించడం కొత్త అయితే కాస్త తక్కువ ఎత్తు ఉన్నవే వేసుకోవాలి. ఒకేసారి 4 నుంచి 6 అంగుళాల ఎత్తు ఉండే హైహీల్స్ వేసుకుంటే పడ్డారంటే దారుణంగా ఉంటుంది. సైజ్ కాస్త తక్కువ ఉన్నవైతే.. వీటితో మీరు సులభంగా నడుస్తారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు.
-Triveni Buskarowthu