చదువు పూర్తయ్యింది. జాబ్ తెచ్చుకోవాలి. వేట ప్రారంభించారు. జాబ్ తెచ్చుకున్నారు. కాలేజీ నుండి బయటకు వచ్చాక పరిస్థితి వేరేలా ఉంటుంది. వాస్తవ జీవితం అప్పుడే కనిపిస్తుంది. కాలేజీలో ఉన్నప్పుడు ఒకలాటి అమాయకత్వం ఉంటుంది. స్నేహం అంటే ప్రాణమిచ్చేంతగా ఉంటారు. ఏ స్నేహితుడికైనా ఏదైనా అయితే వాళ్ళ దగ్గరే ఉండి అన్ని సేవలు చేస్తారు. కానీ ఉద్యోగం వచ్చి జాబ్ లో పడ్డాక కథ మారిపోతుంది. ఫ్రెండ్స్ తగ్గిపోతారు. కొలీగ్స్ మాత్రమే ఉంటారు. అప్పటి దాకా ఫ్రెండ్స్ తో పంచుకున్న విషయాలని కొలీగ్స్ తో పంచుకుంటారు.
కానీ, ఒక్క విషయం తెలుసుకోండి. మీరు కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు మీకెవరూ స్నేహితులు ఉండరు. అందరూ ఎదగాలనే చూస్తారు. మీ సహోద్యోగులు పది మంది ఉంటే అందులో ఎదిగేది ఒక్కరే. ఆ ఒక్కరు ఎవరో మీకు తెలియదు కాబట్టి, ఎవరూ మీతో స్నేహంగా ఉండరు. ఒకవేళ అలా అనిపించినా ప్రమోషన్ సమయంలో విషయమేంటనేది మీకే తెలిసిపోతుంది. అందుకే కొలీగ్స్ తో మీ కాంటాక్ట్ ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలు పంచుకోకపోవడమే ఉత్తమం.
ముఖ్యంగా మీ కుటుంబం గురించి. అలా అని ప్రతీ ఒక్కరూ ఇలానే ఉంటారా? కొలీగ్స్ స్నేహంగా అస్సలు ఉండరా అంటే అదీ కాదు. స్నేహంగా ఉండే కొలీగ్స్ కూడా ఉంటారు. కానీ అలాంటి స్నేహాలు అరుదు. అలా ఉండే చాల స్నేహాల్లో ఒకరు పూర్తిగా కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. అది వదిలిపెడితే, మీ బాస్ గురించి మీ కొలీగ్స్ తో చెడుగా మాట్లాడకండి. ఎవరికి తెలుసు. మీరన్న మాటలు మీ బాస్ తో చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా అలాంటి మాటలని పట్టించుకునే బాసులూ చాలామంది ఉంటారు.