మీరు మీ పాత రిలేషన్ షిప్ నుండి బయటపడాలి అనుకుంటున్నారా..? అయితే ఇలా చెయ్యండి …!

Join Our Community
follow manalokam on social media

సాధారణంగా ఒకరినొకరు ఇష్టపడడం. ఆ తర్వాత చిన్న చిన్న కారణాల వల్ల సెపరేట్ అయిపోవడం జరుగుతోంది. కానీ ఆ ప్రేయసి లేదా ప్రియుడికి జ్ఞాపకాల నుండి బయట పడడం అంత సులువేం కాదు. ప్రతి సారి ఏదో ఒక జ్ఞాపకాలు గుర్తు వస్తూ ఉంటాయి. దీనికోసం మీరు ఈ పద్ధతిని అనుసరిస్తే తప్పకుండా దాని నుండి బయటపడి పోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం పూర్తిగా చూసేయండి.

సోషల్ మీడియాకి దూరంగా ఉంచండి:

సోషల్ మీడియాలో వివిధ రకాల పోస్టులు ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటాము. మీరు మీ పాత ప్రియుడిని లేదా ప్రియురాలిని బ్లాక్ చేసినా… మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ఫోటోలు లేదా వాళ్ళు షేర్ చేసిన పోస్టులు కనబడుతూ ఉంటాయి. వీటివల్ల మీరు అంత త్వరగా మర్చిపోలేరు. పైగా మర్చిపోదాం అని ప్రయత్నించినా అవి మిమ్మల్ని బాధిస్తాయి. కాబట్టి సోషల్ మీడియా కి కాస్త దూరంగా ఉండటం మంచిది.

బహుమతుల్ని దూరంగా ఉంచండి:

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకోవడం సహజం. మీరు రిలేషన్ షిప్ బ్రేక్ చేసుకున్న తర్వాత ఆ చిన్న చిన్న వస్తువులు మిమ్మల్ని ముళ్ళై గుచ్చుతాయి. కాబట్టి ఆ జ్ఞాపకాలు ఏమైనా ఉంటే దూరంగా ఉంచండి.

మీ జీవితం గురించి ఆలోచించండి:

మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు..?, మీ విజయాన్ని మీరు ఎలా సాధించాలి అనుకుంటున్నారు…? వాళ్లు లేకపోయినా మీరు ఎలా బతకగలేరు..? వంటివి ఆలోచించండి దీనితో మీరు వాళ్ళని దూరం పెట్టొచ్చు.

దూరప్రాంతాలని సందర్శించండి:

కొన్ని రోజులు పని నుండి సెలవు తీసుకుని దూర ప్రాంతాలకు వెళ్ళండి. ఇలా వెళ్లి వచ్చే సరికి వాళ్ళ మీద ధ్యాస మళ్ళుతుంది.

TOP STORIES

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో...