అప్పుడప్పుడు ఇంటి వద్ద కూడా తినండి.. జొమాటా ట్వీట్.. ఇతర బ్రాండ్స్ రెస్పాన్స్ ఇదీ..!

-

తాజాగా జొమాటో చేసిన ఓ సరదా ట్వీట్ ఇతర బ్రాండ్ కంపెనీలను కూడా కదిలించింది. ఇతర బ్రాండ్స్ జొమాటోకు కౌంటర్ ఇస్తూ జొమాటో స్టయిల్ లో ట్వీట్టు చేసి తమ బ్రాండ్లకు ప్రమోట్ చేసుకున్నాయి.

జొమాటో.. ప్రస్తుతం ఇండియాలో టాప్ ఫుడ్ ఆర్డర్ ఆన్ లైన్ యాప్. జొమాటో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తమ కంపెనీ గురించి.. డెలివరీ బాయ్స్ గురించి.. కంపెనీ ఉద్యోగుల గురించి పోస్టులు చేస్తుంటుంది.

అయితే.. తాజాగా జొమాటో చేసిన ఓ సరదా ట్వీట్ ఇతర బ్రాండ్ కంపెనీలను కూడా కదిలించింది. ఇతర బ్రాండ్స్ జొమాటోకు కౌంటర్ ఇస్తూ జొమాటో స్టయిల్ లో ట్వీట్టు చేసి తమ బ్రాండ్లకు ప్రమోట్ చేసుకున్నాయి.

ఇంతకీ జొమాటో ఏం ట్వీట్ చేసిందనేగా మీ డౌట్. ఈరోజుల్లో ఎవ్వరూ వండుకోవడం లేదని… అందరూ ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటున్నారని తెలుసు కదా. దానిపైనే సెటైరికల్ ట్వీట్ వేసింది. గయ్స్.. అప్పుడప్పుడు ఇంటి దగ్గర కూడా వండుకొని తినండి.. అంటూ సరదా ట్వీట్ చేసింది.

ఆ ట్వీట్ పై యూట్యూబ్, అమెజాన్, ఇక్సిగో, మొబిక్విక్, ఫాసూస్ లాంటి బ్రాండ్ సంస్థలు కూడా ఫన్నీగా ట్వీట్లు చేశాయి. చివరకు జొమాటో ఆయా సంస్థల ట్వీట్ల స్క్రీన్ షాట్లు తీసి మరో కౌంటర్ ఇచ్చింది. సొంతంగా ట్వీట్ చేయడం నేర్చుకోండి.. అంటూ ట్వీట్ చేసింది జొమాటో.

దీంతో… సోషల్ మీడియాలో జొమాటో ట్వీట్లపైనే చర్చ. అది సంగతి. ఇంతకీ.. మిగితా బ్రాండ్ కంపెనీలు ఏం ట్వీట్లు చేశాయో మీరు చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news