కరోనా మహమ్మారి వచ్చి ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయాయి. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, కోట్లమంది ఆసుపత్రుల పాలయ్యారు. విద్యా, వైద్య, రాజకీయ, ఆర్థిక ఇలా అన్నీ రాజ్ఞాలు స్తంభించిపోయాయి. విద్యా రంగం కదలిక లేకుండా ఆగిపోయింది..! పరీక్షలు వాయిదా పడుతున్నాయి, కొన్ని పరీక్షలను రద్దు చేసి పై తరగతులకు పంపించాయి ప్రభుత్వాలు. ఇక కొత్త ఏకాడమిక్ ఇయర్ ఎప్పుడా అనేదే పెద్ద ప్రశ్నగా మారింది ఇంజనీరింగ్ విద్యార్థులకు. విద్యార్థుల కు ఈపాటికే కాలేజీలు మొదలై పాఠాల టైమ్ టేబుల్ ప్రారంభం అయిపోయేది, కానీ కరోనా మహమ్మారి వల్ల ఏకాడమిక్ ఇయర్ ప్రారంభం అవ్వలేదు. ఈ నేపద్యంలో వారికోసం అధికారులు ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇంజినీరింగ్ కోర్సు నూతన విద్యాసంవత్సరాన్ని సెప్టెంబరు 15 నుంచి ప్రారంభించాలని అఖిల భారత విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. అసలైతే ఏకడమిక్ ఇయర్ ను సెప్టెంబర్ 1 నుండి ప్రారంభించాలని నిర్ణయించిన ఏఐసీటీఈ తాజా కరోనా పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చర్చలు జరిపారు. జనంతరం ఏఐసీటీఈ ఈసారి విద్యా సంవత్సరాన్ని సెప్టెంబరు 15వ తేదీ నుంచి ప్రారంభించేలా షెడ్యూల్ ను విడుదల చేసింది. జులై 15వ తేదీలోపు విశ్వవిద్యాలయాలు కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని, మొదటి విడత బీటెక్ సీట్ల కేటాయింపును ఆగస్టు 30లోగా, రెండో విడత కౌన్సెలింగును సెప్టెంబరు 10వ తేదీలోపు పూర్తి చేయాలని నిర్ణయించింది. పాత విద్యార్థులకు ఆగస్టు 16 నుంచే తరగతులను మెుదలు పెట్టాలని సూచించింది. ఎంత కరోనాకు భయపడినా విధ్యార్థుల తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లల కాలేజీల పై కొంత భయం తప్పదు అటువంటి వారికి ఈ నోటిఫికేషన్ కొంత ఊరట కలిగించే విషయం.