ఎన్ని రకాల ఆభరణాలు ధరించిన కానీ చేతి వేళ్ళకు ఉంగరం లేకపోతే చెయ్యంతా బోసి పోతుంది. అందుకేనేమో చేతికి ఉండే ఐదు వేళ్లలో ఒక దానిని ప్రత్యేకం గా ఉంగరం వేలుగా చెబుతారు. ఇది వరకు ఉంగరాన్ని ఆ ఒక్క వేలుకి పెట్టడం వల్ల ఉంగరం వేలు గా పేరొచ్చింది… అయితే కాలక్రమేణా అందరి ఆలోచనల్లో, అభిరుచులలో చాలా మార్పులు వచ్చాయి. బొటన వేలు తో సహా ఏ ఒక్క వేలు కూడా ఉంగరం పెట్టుకోడానికి అనర్హం కాదు.
ఉంగరం అంటే ఇష్టపడని వారుండరు. మెరుస్తూ చేతికి అందాన్ని తెచ్చేది ఉంగరం. వారి వారి ఇష్టాన్ని బట్టి రకరకాల లోహాలతో తయారుచేసిన ఉంగరాలను ధరిస్తారు. అయితే రాగి ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాగి శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది. దీని వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
రాగి ఉంగరం వేలికి ధరించడం వల్ల సూర్యుని నుండి పాజిటివ్ శక్తి పొంది నెగిటివ్ ను తొలగిస్తుంది. దీని వల్ల మనసు ప్రశాంతం గా ఉండటమే కాకుండా మంచి నిర్ణయాలు తీసుకోడానికి సహాయపడుతుంది. తరచూ తలనొప్పి తో బాధ పడేవారు రాగి నీ ధరించడం వల్ల ఉపశమనం కలుగుతుంది. గుండె పోటు రాకుండా కాపాడుతుంది. రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల ఈ రకమైన ఆరోగ్య ప్రయోనాలున్నాయని శాస్త్ర వేత్తలు చెప్తున్నారు.